ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dr. Maya Tandon : ప్రమాదాల్లో ప్రాణదాతగా...

ABN, First Publish Date - 2024-02-07T03:41:03+05:30

‘‘రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రచారం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినప్పుడు...

‘‘రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రచారం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినప్పుడు... బాధితుల్ని సకాలంలో రక్షించే చైతన్యం, నైపుణ్యం మన సమాజంలో ఉందా?...’’ డాక్టర్‌ మాయా టాండన్‌ను వేధించిన ప్రశ్న ఇది. అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఆ ప్రశ్నకు తానే ఒక సమాధానంగా నిలిచారు. తన ముప్ఫయ్యేళ్ళ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘‘రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రచారం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినప్పుడు... బాధితుల్ని సకాలంలో రక్షించే చైతన్యం, నైపుణ్యం మన సమాజంలో ఉందా?...’’ డాక్టర్‌ మాయా టాండన్‌ను వేధించిన ప్రశ్న ఇది. అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఆ ప్రశ్నకు తానే ఒక సమాధానంగా నిలిచారు. తన ముప్ఫయ్యేళ్ళ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘‘న్యూస్‌ పేపర్లలో, టీవీల్లో రోడ్డు ప్రమాదాల గురించి వార్తలులేని రోజంటూ ఉండదు. అలాంటి ప్రమాదాల్ని మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. అదే ఆ బాధితుల స్థానంలో మన ఆత్మీయులుంటే? వారికి తొందరగా వైద్య సహాయం అందాలని ఆరాటపడతాం. అందరి విషయంలోనూ మన స్పందన ఇదే విధంగా ఉండాలి. అదే మానవత్వం’’ అంటారు డాక్టర్‌ మాయా టాండన్‌. ఆమె నేతృత్వంలోని ‘సహాయత’ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులు వేలాది మంది రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.

శిక్షణ కోసం ‘సహాయత’

మాయ ప్రాథమిక విద్య రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సాగింది. జైపూర్‌లో మెడిసిన్‌ పూర్తి చేసి, అక్కడే వైద్యురాలిగా వృత్తి జీవితం ప్రారంభించారు. జె.కె.లాన్‌ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. వైద్యురాలిగా ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండేవారు. ‘‘రాజస్థాన్‌ పోలీస్‌ అకాడమీలో పోలీసుల కోసం ‘అత్యవసర స్పందన’ (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌) మీద ఒక కార్యక్రమాన్ని 1994లో నిర్వహించాను. పోలీస్‌ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు... ఈ అంశంపై మనకు తెలిసింది తక్కువేనని అర్థమయింది. నిజానికి ఇది ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదు. ప్రజలకు ప్రాథమిక శిక్షణ ఇచ్చినట్టయితే, ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చనిపించింది’’ అని వివరించారు మాయ. అనంతరం తన మిత్రులతో చర్చించి... ‘సహాయత’ అనే సంస్థను నెలకొల్పారు. 1995లో పదవీవిరమణ చేసిన తరువాత... పూర్తి స్థాయిలో రహదారి భద్రతా శిక్షణకే అంకితమయ్యారు. ప్రమాదాల నివారణతో పాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర చికిత్స అందించడంపై ప్రభుత్వ విభాగాల్లో, విద్యా సంస్థల్లో శిక్షణ ప్రారంభించారు. దానికోసం వైద్యులు, ఇతర నిపుణులతో బృందాలను ఏర్పాటు చేశారు. వారితో కలిసి రాజస్థాన్‌ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు, వాలంటీర్లకు, పౌరులకు శిక్షణ కార్యక్రమాలను ముప్ఫయ్యేళ్ళుగా నిర్వహిస్తున్నారు. ‘‘నేను నిర్వహించిన అతి పెద్ద శిక్షణ కార్యక్రమం... జైపూర్‌-ఢిల్లీ హైవేని ఆనుకొని నివసించే ప్రజల కోసం. అది ప్రమాదాలకు ప్రసిద్ధి చెందిన రహదారి. ఆ కార్యక్రమానికి మేము ఊహించనంత స్పందన వచ్చింది. వందలమంది శిక్షణ తీసుకున్నారు. కళ్ళెదుట ప్రమాదం జరిగి, వ్యక్తులు ప్రాణాపాయంతో ఉన్నా... వారికి ఎలా సహాయం అందించాలో చాలామందికి తెలీదు. మరోవైపు పోలీసు కేసుల్లో చిక్కుకుంటామనే బెదురు కూడా ఉంటుంది. అలాగే బాధితులకు శరీరంలో వివిధ భాగాలకు గాయాలు తగిలినప్పుడు, ఊపిరి ఆడడం కష్టమైనప్పుడు, కాలిన గాయాలైనప్పుడు, మానసికమైన షాక్‌లో ఉన్నప్పుడు... స్వస్థత కలిగించడానికి అనుసరించవలసిన పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఈ అంశాను ప్రధానంగా నేర్పిస్తున్నాం. మా దగ్గర శిక్షణ పొందినవారు ప్రాణాలను కాపాడారన్న సమాచారం దాదాపు ప్రతిరోజూ మేము అందుకుంటున్నాం’’ అని చెబుతారు మాయా టాండన్‌.

తప్పనిసరి బోధనాంశం చెయ్యాలి...

‘సహాయత’ ద్వారా మాయ, ఆమె బృందం అందించే శిక్షణలో... సిపిఆర్‌, ప్రమాద స్థలాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యల క్రమం, ప్రోటోకాల్స్‌, వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం అందించడం తదితర అంశాలు ప్రధానంగా ఉంటాయి. స్థానికులు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు... తక్షణమే తమకుగానీ, దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు కానీ సమాచారం అందించేలా ప్రజలకు చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ‘‘ఇప్పుడు రాజస్థాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా మా శిక్షణ కొనసాగిస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంటే, ఆ బాధితుణ్ణి ఆసుపత్రికి తీసుకువెళ్ళే లోపు... తగిన విధంగా ఫస్ట్‌ ఎయిడ్‌ అందిస్తే... వారి ప్రాణాలను నిలబెట్టవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గుండెపై ఒత్తిడిని అప్లై చెయ్యడం, నోటి ద్వారా శ్వాసను అందించడం (సిపిఆర్‌) లాంటి చర్యలు ప్రధానం. అయితే గాయపడిన ప్రతి ఒక్కరికీ సిపిఆర్‌ అవసరం లేదు. బాధితుడికి గాయం ఎక్కడయిందో ముందుగా గమనించాలి. ఏవైనా భాగాలు బయటికి వస్తే, వాటిని తిరిగి లోపలికి పంపాలని ప్రయత్నించకూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి, వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. అంబులెన్స్‌ రావడానికి సమయం పట్టేలా ఉంటే... దగ్గరలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రికి బాధితుణ్ణి తక్షణమే తరలించాలి. ఇటువంటి అనేక అంశాలను ప్రజలకు మేము వివరిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ అంశాలపై ఉద్యమస్థాయిలో ప్రచారం జరగాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కడైనా జరగవచ్చు. ప్రతి పౌరుడికీ ప్రథమ చికిత్స తెలిసి ఉంటే... ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు’’ అని వివరించారామె. ముప్ఫయ్యేళ్ళ తన కృషికి ఎన్నో అవార్డులను, గౌరవాలను అందుకున్న 87 ఏళ్ళ మాయా టాండన్‌కు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. ‘‘ఇది మా బాధ్యతను మరింత పెంచింది. ఈ గుర్తింపు సమష్టి కృషి ఫలితం. మనిషి పట్ల మరొక మనిషికి ఉన్న బాధ్యతను తెలుసుకొని... అత్యవసర సమయాల్లో ఆదుకోవాలనే తపనతో ఎందరో మాతో చేతులు కలిపారు. నా కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. అందరికీ ధన్యవాదాలు’’ అంటున్నారు మాయ. ఆమె జాతీయ రహదారి భధ్రతా మండలిలో సభ్యురాలుగానూ కొంతకాలం వ్యవహరించారు. ‘‘పాఠశాలల్లో ‘అత్యవసర ప్రథమ చికిత్స’ను తప్పనిసరి బోధనాంశంగా చెయ్యాలి. ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలి’’ అనేది ఆమె విజ్ఞాపన.

ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంటే, ఆ బాధితుణ్ణి ఆసుపత్రికి తీసుకువెళ్ళే లోపు ఫస్ట్‌ ఎయిడ్‌ అందిస్తే వారి ప్రాణాలను నిలబెట్టవచ్చు.

Updated Date - 2024-02-07T03:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising