ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roti Pachadi : రోటి పచ్చడి... కచ్చా పచ్చా!

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:07 AM

కూరలు, మసాలా కర్రీలు, మాంసాహారం.. ఎన్ని తిన్నా... ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ.. ఈ రోటి పచ్చడి కథే వేరు. అన్నం, దోశలోకి కొద్దిగా రోటి పచ్చడి వేసుకుని తింటే..

కూరలు, మసాలా కర్రీలు, మాంసాహారం.. ఎన్ని తిన్నా...

ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ.. ఈ రోటి పచ్చడి కథే వేరు.

అన్నం, దోశలోకి కొద్దిగా రోటి పచ్చడి వేసుకుని తింటే..

ఆ రుచి అదరహో. ఈ వీకెండ్‌లో దొండకాయ రోటి పచ్చడి,

కంద రోటి పచ్చడి, కాల్చిన వంకాయల రోటి పచ్చడి,

పండు మిరపకాయల రోటి పచ్చడిని సులువుగా

ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

దొండకాయ రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు

దొండకాయ ముక్కలు- 300 గ్రాములు, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, మీడియం సైజ్‌ ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), చిన్న టమోటాలు- 3, పచ్చిమిర్చి-8 (సగానికి కట్‌ చేయాలి), వేయించిన పల్లీలు- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి- 4, చింతపండు రసం- టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- కొద్దిగా, పసుపు- తగినంత

తయారీ విధానం

ఒక గుంత ప్యాన్‌లో నూనె వేసి దొండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్‌లో అవి మగ్గేవరకు కనీసం పది నిముషాలు కుక్‌ చేయాలి. మధ్యమధ్యలో చూసుకుంటూ మగ్గేంత వరకూ కుక్‌ చేయాలి. వీటిని ప్లేట్‌లో పక్కన ఉంచుకోవాలి.

రోలులో వేయించుకున్న దొండకాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి దంచాలి. వేయించిన పల్లీలు, వెల్లుల్లి వేసి దంచాలి. ఇందులో ఉప్పు, పసుపును రుచికి తగినట్లు వేసుకుని రుబ్బాలి. చివరగా పల్లీలు వేసి

ఆ తర్వాత చింతపులుసు వేసి దంచాలి. మిశ్రమంలోకి బాగా పడుతుంది. అవసరం అనుకుండా ఈ పచ్చడిని పోపు వేసుకోవచ్చు. అన్నంలోకి, దోశ, చపాతీలోకి బావుంటుంది ఈ దొండకాయ పచ్చడి.

కంద రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు

శుభ్రపరచిన కందగడ్డ ముక్కలు- 300 గ్రాములు, ఎండుమిర్చి- 6, ఇంగువ- తగినంత, ఆవాలు- కొద్దిగా, శనగలు- అరటీస్పూన్‌, మెంతులు- కొద్దిగా, మినప్పప్పు- అరటీస్పూన్‌, చింతపండు గుజ్జు- రెండు స్పూన్లు, నూనె- 4 టీస్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- కొద్దిగా, ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా తరగాలి), టొమాటో- 1 (చిన్న ముక్కలుగా తరగాలి)

తయారీ విధానం

శుభ్రపరచిన కంద ముక్కలను బియ్యం కడిగిన నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేస్తే కంద వల్ల దురదరాదు. ఇలా పది నిముషాల పాటు నానబెట్టాలి. ఒక ప్యాన్‌లో సరిపడ నూనె వేసి కంద ముక్కలను పదిహేను నిముషాల పాటు వేయించాలి. మెత్తగా అవుతాయి. ఆ కంద ముక్కలను పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలను వేయించాలి. చివరగా అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి శనగలు, ఆవాలు, మెంతులు, మినప్పప్పును వేయించుకోవాలి. రోటిలో కంద ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కచ్చాపచ్చాగా నూరాలి. ఇందులోకి సరిపడ ఉప్పు, పసుపు వేసి నూరాలి. చివరగా పోపు మిశ్రమాన్ని వేసి నూరాలి. కంద పచ్చడి రెడీ. అన్నంలో లేదా దోశలోకి బాగుంటుంది.

కాల్చిన వంకాయ రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు

మీడియం సైజ్‌ పచ్చ వంకాయలు- 4, టొమాటోలు- 3 (చిన్నవి), ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 6, చింత పులుసు- టీస్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- చిటికెడు

తయారీ విధానం

స్టవ్‌మీద రోటీ గ్రిల్‌ ఉంచి దాని మీద వంకాయలను పైన పొట్టు నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. వీటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చి కాల్చుకోవాలి. వీటిమీద ఉండే నల్లటి పొట్టు వల్చేయాలి. రోటిలో ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి వేసి దంచాలి. ఆ తర్వాత వంకాయలను వేసి దంచాలి. ఇందులో పసుపు, చింత పులుసు, ఉప్పు వేసి దంచాలి. ఈ కచ్చా పచ్చా వంకాయల రోటి పచ్చడి స్మెల్‌ అద్దిరిపోతుంది. దీన్ని బౌల్‌లో వేసుకుని తాజాగా సర్వ్‌ చేసుకోవటమే తరువాయి. అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పండు మిరపకాయల రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు

పండు మిరపకాయలు- 12, టొమాటోలు- 3 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), ఉల్లిపాయ-1 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), కరివేపాకు- కొద్దిగా, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాలు- అరటీస్పూన్‌, జీలకర్ర- అరటీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు- 6, చింతపండు- కొద్దిగా, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడ

తయారీ విధానం

ప్యాన్‌లో నూనె వేసి అందులో పండు మిరపకాయలను వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నూనె జతచేయాలి. ఈ మిశ్రమాన్ని రోటిలో వేసి దంచాలి. చివరగా ఉప్పు, పసుపు వేసి దంచాలి. ఈ పండు మిరపకాయల పచ్చడిని అవసరం అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - Jan 20 , 2024 | 12:07 AM

Advertising
Advertising