Living relationship: లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నారా.. ఇవి గుర్తు పెట్టుకోండి..!
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:10 PM
మీరు మీ భాగస్వామితో లివింగ్ రిలేషన్‌షిప్‌లో జీవించాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి.
Living relationship: లివింగ్ రిలేషన్‌షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే తమ భాగస్వామితో కలిసి జీవిస్తున్నారు. దీనిని లివింగ్ రిలేషన్షిప్ అని అంటారు. అయితే, మీ బంధం విచ్ఛిన్నం కావడానికి ఇది కూడా ఒక కారణమని మీకు తెలుసా? లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటం కామన్ కదా.. అలా ఉంటే ఏం నష్టం జరుగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం..
లాభాలు:
లివింగ్ రిలేషన్‌షిప్‌లో జీవించడం ద్వారా భాగస్వాములు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. ఒకరి అలవాట్లు, జీవనశైలి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఇది వారి భవిష్యత్తులో కలిసి జీవించడంలో సహాపడుతుంది. ఒత్తిడి లేదా సంతోషం సమయంలో ఒకరికొకరు భౌతికంగా ఉండటం వల్ల మానసిక బంధం పెరుగుతుంది. లివ్-ఇన్‌లో స్వేచ్ఛ ఎక్కువుగా ఉంటుంది. ఈ సంబంధంలో మీరు కలిసి సంతోషంగా లేకుంటే మీరు సులభంగా విడిపోవచ్చు.
నష్టాలు:
లివింగ్ రిలేషన్‌షిప్‌లో జీవించడం వల్ల ప్రయోజనాలకంటే ప్రతికూలతలే ఎక్కువుగా ఉన్నాయి. వివాహం లేకుండా కలిసి జీవించడం ద్వారా ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగడం కష్టమవుతుంది. అభద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టనర్‌తో చిన్న విషయాలకు గొడవ పడినా దూరం పెరుగుతుంది. అలా కొంచెం దూరం అయినా ఈ బంధం తెగిపోతుంది. చాలా మంది జంటలు తమ తల్లిదండ్రులకు తెలియజేయకుండా కలిసి జీవిస్తారు కాబట్టి కొంత కాలానికి ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పోతుంది.
లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు చట్టపరమైన హక్కులు, రక్షణ తక్కువుగా ఉంటుంది. ఇది ఆస్తి హక్కులు, వారసత్వం మరిన్నింటిని ప్రభావితం చూపిస్తుంది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ బంధంలో పిల్లలను కనాలని నిర్ణయించుకుంటే, పిల్లల పెంపకం, సామాజిక అవగాహనల గురించి ఆందోళనలు చెందాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో, కలిసి జీవించడం వల్ల కుటుంబం లేదా స్నేహితుల ఒత్తిడికి దారి తీస్తుంది.
Also Read:
ఈ రూల్స్ పాటించకపోతే మీది లవ్ మ్యారేజ్ అయినా బ్రేకప్ అవడం ఖాయం..
Updated Date - Nov 06 , 2024 | 05:10 PM