ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Copper : రాగి పాత్రలో నీరు తాగడం కాలేయానికి ప్రమాదాన్ని తెస్తుందా.. !

ABN, Publish Date - Jan 06 , 2024 | 02:11 PM

శరీరం దాని సహజ నియంత్రణ విధానాలను అధిగమించి రాగి నీటినిని అధికంగా తీసుకుంటే కనుక అది విషపూరితం అవుతుంది.

copper toxicity

పూర్వం నుంచి రాగి పాత్రల్లో నీటిని తాగడం అనేది అలవాటుగా వస్తూనే ఉంది. ఇది శరీరానికి మంచిదని మన పూర్వీకులు నమ్ముతూనే వచ్చారు. మనకు కూడా అదే అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు అందరి ఇండ్లలోనూ రాగి పాత్రలు ఉంటూనే ఉన్నాయి. ఇందులో రాత్రిపోసిన నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం అసలు ఆరోగ్యానికి మంచిదేనా... అదే తెలుసుకుందాం.

రాగి పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల అవి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చట.. దీనితో శరీరంలో జీవక్రియకు బాధ్యత వహించే కాలేయం రాగి నీటిని తీసుకోవడంతో ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో తేలింది. రాగి పాత్రల్లో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అధిక రాగి స్థాయిలు పెరిగితే అది కాపర్ టాక్సిసిటీకి దారితీయవచ్చు. ఇది కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది.

శరీరం దాని సహజ నియంత్రణ విధానాలను అధిగమించి రాగి నీటిని అధికంగా తీసుకుంటే కనుక అది విషపూరితం అవుతుంది. దీనితో కాలేయ సామర్థ్యం దెబ్బతీస్తుంది. కాలేయ కణాలు కూడా దెబ్బతింటాయి. పనితీరు మందగిస్తుంది.

ఇది కూడా చదవండి: కుంకుమ పువ్వుతో కలిగే తొమ్మిది రకాల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా.. !


రాగి తీసుకోవడం జింక్ వంటివి అతి తక్కువ మోతాదులో తీసుకోవాలి. రాగి, జింక్ వంటివి అధికంగా ఉంటే అవి ప్రేగులలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ ఇన్ బ్యాలెన్స్ వల్ల జింక్ స్థాయిలు పెరిగి, విల్సన్స్ వ్యాధి వంటి కొన్ని కాలేయ రుగ్మతలు కలుగుతాయి. ముఖ్యంగా రాగి జీవక్రియను బలహీనపరిచే జన్యుపరమైన రుగ్మత, విషపూరిత ప్రమాదాన్ని పెంచుతుంది.

రాగి శరీరంలో విషపూరితం, అయినపుడు వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉండవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే కాలేయం దెబ్బతినడం, మూత్రపిండాల సమస్యలు, గందరగోళం, వణుకు వంటి నాడీ సంబంధిత లక్షణాలతో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చర్మం రంగు పాలిపోవడాన్ని, దురదను కలిగిస్తుంది. అలాగే కళ్ళు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. పెరిగిన రాగి స్థాయిలు జింక్‌తో సమతుల్యతను దెబ్బతీస్తాయి, రోగనిరోధక పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇది రక్తహీనతకు దారితీయవచ్చు. కడుపు నొప్పి, తలనొప్పి, నోటిలో లోహపు రుచి వంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఈ అనుమానం ఉంటే వెంటనే వైద్య సలహాను కోరడం మంచిది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 06 , 2024 | 03:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising