ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kidney Health : కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల గురించి తెలుసా.. !

ABN, Publish Date - Jan 26 , 2024 | 03:29 PM

కిడ్నీ సమస్యలను మరీ ముదిరి గుర్తించే లోపు మంచి ఆహారం తీసుకుని కిడ్నీ ఆరోగ్యన్ని పెంచుకోవడం చాలా అవసరం. శరీరం నుంచి విషాన్ని తొలగించాలంటే మంచి ఆరోగ్యాన్ని పెంచడానికి కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.

kidneys healthy

కిడ్నీ వ్యాధి ప్రధాన ప్రజారోగ్య సమస్య. కిడ్నీ వ్యాధి చాలా ముదిరే వరకు తరచుగా గుర్తించే వీలు ఉండదు. దురదృష్టవశాత్తు, ఎవరికైనా డయాలసిస్ లేదా మార్పిడి అవసరం వరకూ పరిస్థితి వెళిపోతుంది. అందుకని కిడ్నీ సమస్యలను మరీ ముదిరి గుర్తించే లోపు మంచి ఆహారం తీసుకుని కిడ్నీ ఆరోగ్యన్ని పెంచుకోవాలి. శరీరం నుంచి విషాన్ని తొలగించాలంటే కూడా కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఏవంటే..

బ్లూబెర్రీస్..

బ్లూబెర్రీస్ లో ఆంథోసైనిన్స్ అని పిలవబడే పోషకాలున్నాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆహారాలకు మంచి రుచిని ఇస్తుంది. పదార్థాల్లో ఉప్పు అవసరాన్ని తగ్గిస్తుంది.

పసుపు..

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది అధిక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి వాపును తగ్గించడంలో అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి.

ఇది కూడా చదవండి: రాగి సూప్ తీసుకోవడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు తెలుసా..!


బెల్ పెప్పర్స్

బెల్ పెప్పర్స్ విటమిన్ ఎ, సి యాంటీఆక్సిడెంట్లతో ఉంటుంది. వీటిలోని పోటాషియం కూడా తక్కువగా ఉంటుంది. ఇవి మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని, పెంచుతాయి.

ఆలివ్ నూనె..

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ ఉంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 26 , 2024 | 03:31 PM

Advertising
Advertising