ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold - Dhanteras: ధన త్రయోదశి రోజున ఏ సమయంలో బంగారం కొనాలి

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:07 PM

ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేసి దేవుళ్లను పూజిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనవి కావడంతో వీటిని కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏడాది ధన త్రయోదశి రోజున పసిడి కొనుగోళ్లు ఎక్కువగా నమోదవుతుంటాయి. మరి ఈ ఏడాది సమయంలో బంగారం కొనాలి

Gold buying

హిందువులకు ముఖ్యమైన పర్వదినాల్లో ధన త్రయోదశి (Dhanteras) కూడా ఒకటి. పవిత్రమైన ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాదంతా శుభం జరుగుతుందని, ఆరోగ్యం, సిరిసంపదలు నిండుతాయని హిందువులు విశ్వసిస్తుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ధన్వంతరీ, లక్ష్మీ దేవి, వినాయకుడు, కుబేర దేవతలను పూజిస్తుంటారు. బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి దేవుళ్లను పూజిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనవి కావడంతో వీటిని కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏడాది ధన త్రయోదశి రోజున పసిడి కొనుగోళ్లు ఎక్కువగా నమోదవుతుంటాయి.


మంచి ముహూర్తం ఎప్పుడుంటే

కాగా ఈ ఏడాది ధన త్రయోదశి పండగ అక్టోబర్ 29న జరగనుంది. అయితే దీపావళి, ధన త్రయోదశి పూజకు ప్రత్యేక సమయం లేదా ముహూర్తం ఉన్నట్టే బంగారం లేదా వెండి కొనుగోలుకు కూడా అనుకూలమైన సమయం ఉంది. అక్టోబర్ 29న ఉదయం 10:31 గంటలకు ధన త్రయోదశి శుభ ముహూర్తం ప్రారంభమై.. అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇంకా సరైన సమయం కావాలనుకుంటే అక్టోబర్ 29 అర్ధరాత్రి 12:01 గంటలకు ప్రారంభమై అదే రాత్రి 2:45 గంటల మధ్య కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.


బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్టోబర్ 26 నాటికి న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,740గా ఉంది. ఈ ఏడాది బంగారం ధర దాదాపు 30 శాతం మేర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.80,000 దగ్గరగా ఉంది. గత ఏడాది దీపావళి నవంబర్ 10న జరగగా అప్పుడు బంగారం ధర రూ.60,750గా ఉంది. అది ఇప్పుడు రూ.79,000కి పెరిగిందని ఐడీజేఏ రిపోర్ట్ పేర్కొంది. ఏడాదిలో దాదాపు 30 శాతం పెరుగుదల నమోదయిందని పేర్కొంది.

Updated Date - Oct 27 , 2024 | 04:08 PM