ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మృదువైన చర్మానికి కాకరకాయ!

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:23 AM

నిగనిగలాడే మృదువైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి చర్మం కోసం రకరకాలైన క్రీములు కూడా రాస్తూ ఉంటారు. ఈ క్రీములతో పాటుగా ఈ కింది ఆహారపదార్థాలు

నిగనిగలాడే మృదువైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి చర్మం కోసం రకరకాలైన క్రీములు కూడా రాస్తూ ఉంటారు. ఈ క్రీములతో పాటుగా ఈ కింది ఆహారపదార్థాలు తినటం వల్ల ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఆ ఆహార పదార్థాలేమిటో చూద్దాం.

పుదీనా

పుదీనాను ఎక్కువగా తినటం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. దీనిలో ఉండే రోజ్‌మేరినిక్‌ యాసిడ్‌ వల్ల శరీరంలోని రక్త ప్రసారం బాగా పెరుగుతుంది. దీని వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పుదీనా ఆకులు చర్మ సంబంధ వ్యాధుల నివారణకు కూడా ఉపకరిస్తాయి.

కాకరకాయ

కాకరకాయను తినటం కష్టమే! అయితే కాకరలో మనకు ఉపకరించే విటమిన్‌ఈ, విటమిన్‌ సీ, కేరోటిన్‌ వంటి అనేక పదార్థాలు ఉన్నాయి. మన శరీరంలోని చర్మకణాలపై ఫ్రీరాడికల్స్‌ దాడి చేయకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి.

నేరేడు పండు

చర్మాన్ని కాపాడే క్విర్‌సిటిన్‌, ఎలాజిక్‌ అనే రెండు యాసిడ్‌లు దీనిలో ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని- యూవీ కిరణాల నుంచి కాపాడుతూ ఉంటాయి. నేరేడు పండు చర్మంపై ఉండే ఎర్రమచ్చలను కూడా పోగొడుతుంది.

ఉసిరి

చర్మం ఎండిపోకుండా.. నిగనిగలాడుతూ ఉండటానికి కొలేజిన్‌ అనే పదార్థం చాలా ముఖ్యం. దీని తయారీలో ఫైబ్రోబ్లాస్ట్స్‌ అనే పదార్థాలు ఉపకరిస్తాయి. ఇవి మన శరీరానికి తగినంత అందటంలో ఉసిరి కీలకమైన పాత్ర పోషిస్తుంది.

Updated Date - Jan 18 , 2024 | 03:23 AM

Advertising
Advertising