ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నల్ల మిరియాలతో ప్రయోజనాలెన్నో!

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:54 AM

శీతాకాలంలో అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య దగ్గు, జలుబు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది మిరియాలనే. ఈ సందర్భంగా మిరియాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

శీతాకాలంలో అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య దగ్గు, జలుబు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది మిరియాలనే. ఈ సందర్భంగా మిరియాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణకు మిరియాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలోని యాంటి సెప్టిక్‌ గుణాలు శరీరంలో సత్తువను పెంచుతాయి. వేడి వేడి పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే దగ్గు, జలుబుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో మిరియాలు, తులసి ఆకులు, ఆల్లం వేసి బాగా కాచి గోరువెచ్చగా అయ్యాక కొంచెం తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి.

  • మిరియాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్‌ నీటిలో కొన్ని మిరియాలు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే గ్యాస్‌, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

  • రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను క్రమబద్దీకరించి డయాబెటి్‌సను అదుపులో ఉంచుతాయి. మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగు పరచి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా తోడ్పడతాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.

  • మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అదే పసుపుతో కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.

  • కీళ్లవాతం ఉన్నవారు మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే వాపు తగ్గుతుంది.

  • దంత సమస్యల నివారణకు, శరీరంలో అధిక కొవ్వును కరగించేందుకు, గొంతు గరగర నుంచి ఉపశమనానికి మిరియాల పొడి ఉపకరిస్తుంది.

Updated Date - Oct 16 , 2024 | 12:54 AM