Kristen Fisher : అమెరికాలో ఇలా..!
ABN, Publish Date - Nov 07 , 2024 | 05:56 AM
మనతో పోలిస్తే చాలా విషయాల్లో వాళ్ల అలవాట్లు, అభిరుచులు పూర్తి భిన్నంగా ఉంటాయట. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాలను సరదాగా నెటిజనులతో పంచుకుంది అమెరికా మహిళ... క్రిస్టెన్ ఫిషర్. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె... ఇక్కడివారితో తమ దేశవాసుల జీవన
మీరు రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేస్తారు?
బాగా పొద్దు పోయాక... అంతేగా! టీ ఎంత తాగుతారు?
ఓ కప్పు... లేదా అర కప్పు... అవునా! మరి అమెరికన్లు..?
మనతో పోలిస్తే చాలా విషయాల్లో వాళ్ల అలవాట్లు, అభిరుచులు పూర్తి భిన్నంగా ఉంటాయట. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాలను సరదాగా నెటిజనులతో పంచుకుంది అమెరికా మహిళ... క్రిస్టెన్ ఫిషర్. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె... ఇక్కడివారితో తమ దేశవాసుల జీవన శైలిని పోలుస్తూ ఓ రీల్ చేసింది. అందులో తనే ఏకపాత్రాభినయం చేసి, దాన్ని ఇన్‌స్టాలో పెట్టింది. అక్కడి నుంచి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఫిషర్ గమనించిన ఆ తేడాలేంటి? ఆమె మాటల్లోనే...
మా అమెరికన్లకు వంటలో తాలింపు (సీజనింగ్) అంటే సాధారణంగా ఉప్పు, మిరియాలపొడి... అంతే. అదే భారత్‌లో అయితే పసుపు, ధనియాల పొడి, ఎండు మామిడి పొడి, జీలకర్ర, ఆవాలు, గరంమసాలా... ఇలా రకరకాల మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి.
అమెరికన్లు సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలకల్లా రాత్రి భోజనం ముగించేస్తారు. కానీ ఎక్కువమంది భారతీయులు ఆలస్యంగా, అంటే రాత్రి తొమ్మిది లేదా పది గంటలకు తింటారు.
అమెరికాలో కాఫీ కప్పులు చాలా పెద్దవి... మగ్గుల్లా ఉంటాయి. వెంట పెట్టుకుని తరచూ తాగు తుంటారు. భారత్‌లో టీ కప్పులు చిన్నవి. చాయ్‌ని నిదానంగా సిప్ చేస్తూ ఆస్వాదిస్తారు. అదికూడా స్నేహితులతోనో, సన్నిహితులతోనో కలిసి..!
అమెరికన్లు శాండ్‌విచ్ లాంటివి మినహా మిగిలిన ఆహార పదార్థాలు చాకుతోనో, ఫోర్క్‌తోనో తింటారు. కానీ భారత్‌లో చేత్తో తినడం సర్వసాధారణం.
అక్కడ క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ గడియారంతో పరిగెత్తే కంటే... మనుషులు, మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు.
2017లో మొదటిసారి భారత్‌లో పర్యటించిన ఫిషర్... ఇక్కడి మట్టి, మనుషులతో ప్రేమలో పడ్డారు. తరువాత రాజధాని ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 05:56 AM