ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాముడితో రాజకీయమేంటి?

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:07 AM

రాముడు రాజకీయం చేశాడా, లేక భక్తులే ఆయనతో రాజకీయం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. బుధవారం ఒక మీడియా సంస్థతో

మందిర నిర్మాణం పూర్తయింది

మండపాల పనులే మిగిలాయి

ఆలయ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా

న్యూఢిల్లీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాముడు రాజకీయం చేశాడా, లేక భక్తులే ఆయనతో రాజకీయం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. బుధవారం ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాజకీయాలను చూడటం మన దృష్టిని బట్టి ఉంటుందన్నారు. ఆలయం పూర్తిగా నిర్మాణమైందని నృపేంద్ర స్పష్టం చేశారు. బాల రాముడు గర్భగృహంలో ఉంటారని తెలిపారు. అయిదు మండపాలు, ఆలయం కింది అంతస్తులో ఉంటాయని అన్నారు. మొదటి అంతస్తు మాత్రమే ఇంకా నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నదని చెప్పారు. అందులో రామ దర్బార్‌ ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత నిర్మించే రెండో అంతస్తులో అనుష్ఠానం, యజ్ఞాలు జరుగుతాయని వివరించారు.

Updated Date - Jan 18 , 2024 | 08:32 AM

Advertising
Advertising