ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ayodhya History: 500 ఏళ్ల అయోధ్య రామమందిర చరిత్ర ఇదీ..

ABN, Publish Date - Jan 22 , 2024 | 04:40 AM

1528 అయోధ్యలో రాముడి జన్మస్థలమని హిందువులు భావించే చోట మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ మసీదును నిర్మించాడు.

1528 అయోధ్యలో రాముడి జన్మస్థలమని హిందువులు భావించే చోట మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ మసీదును నిర్మించాడు.

1853-1949

ఈ స్థలం గురించి హిందూ-ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దీంతో బ్రిటిష్‌ వాళ్లు మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు, మసీదు వెలుపలి ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు.

1949 మసీదు లోపల రాముడి విగ్రహం బయటపడింది. హిందువులు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో మసీదును వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి మసీదుకు తాళం వేశారు.

1950

మసీదు లోపల బయటపడిన రామ్‌ లల్లా విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఫైజాబాద్‌ సివిల్‌ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 1959లో నిర్మోహీ అఖాడా మూడో పార్టీగా పిటిషన్‌ వేసింది.

1961 మసీదు లోపలి రామ్‌ లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు కోర్టుకు వెళ్లింది.

1986 మసీదు తలుపులు తెరవాలని, హిందువులు పూజలు చేసుకు నేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్‌ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

1992, డిసెంబరు 6

కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. తర్వాత చెలరేగిన హింసలో 2వేల మందికి పైగా చనిపోయారు.

2001 బాబ్రీ కూల్చివేత, హింస కేసులో స్పెషల్‌ జడ్జి ఆడ్వాణీ, కల్యాణ్‌ సింగ్‌ సహా 13 మందిని నిర్దోషిగా ప్రకటించారు.

2002

హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన హింసలో 2వేల మందికి పైగా మృతి చెందారు.

2010 ’

అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని మూడొంతులుగా విభజించి.. రెండు వంతులను హిందూ పార్టీలకు, ఒక వంతును వక్ఫ్‌ బోర్డుకు కేటాయించింది.

2011 అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

2017

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది.

2019, మార్చి 8

అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. 8వారాల్లోగా ప్రొసీడింగులను పూర్తి చేయాలంది.

2019, నవంబరు 9 అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్‌లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణా నికి 5ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2020 ఫిబ్రవరి 5

అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 15 సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది.

2020 ఆగస్టు 5 ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.

2024, జనవరి 22

భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ

Updated Date - Jan 22 , 2024 | 06:54 AM

Advertising
Advertising