ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gyanvapi: జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు!.. సంచలన విషయాలు వెల్లడి

ABN, Publish Date - Jan 26 , 2024 | 04:46 AM

జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి, ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం (ఏఎ్‌సఐ) సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతోపాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా

ఔరంగజేబు హయాంలో మందిరం ధ్వంసం

దానిపైనే మసీదు నిర్మాణం

ఆలయ స్తంభాలు, రాళ్లు వాడారు

కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు

దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో 34 శిలా శాసనాలు

వాటిల్లో దేవతల పేర్లు కళాకృతులు, ప్రవేశద్వారాలు,

శిల్పరీతి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి: స్పష్టం చేసిన ఏఎస్‌ఐ

కక్షిదారులకు నివేదిక ప్రతులు

వారాణసి, జనవరి 25: జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి, ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం (ఏఎ్‌సఐ) సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతోపాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది. ఏఎ్‌సఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు.. జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు. హిందూ కక్షిదారుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ విలేకరుల సమావేశంలో ఏఎ్‌సఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు. ఈ నివేదిక 839 పేజీలు ఉన్నదని తెలిపారు. గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదును నిర్మించారని, ఈ మేరకు పలు ఆధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను ఉపయోగించారని, ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారని తెలిపారు. ‘సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై, అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్లు ఏఎ్‌సఐ గుర్తించింది. వీటిలో 32 శాసనాలను నకలు చేసింది. ఇవి దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయి. వాస్తవానికి ఇవి హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలు. వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయి’ అని ఏఎ్‌సఐ నివేదిక వెల్లడించిందని విష్ణుశంకర్‌ జైన్‌ తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

భూమిలో కూరుకుపోయిన విగ్రహాలు

ఏఎ్‌సఐ సర్వే నివేదికలోని ఇతర వివరాలు కొన్ని వెబ్‌సైట్లలో వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో, అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. అక్కడ లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశద్వారం ఉంది. పక్షులు, జంతువులు, పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. గోడలను లతలతో తీర్చిదిద్దారు. పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకుముందటి ఆలయంలోనిదే. మసీదులోని ఒక గదిలో ఓ శాసనం లభ్యమైంది. అయితే దాని మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించింది. అంతకుముందున్న ఆలయం విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు.

నేపథ్యం ఇదీ..

వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదు కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో.. కోర్టు ఆ ప్రాంతంలో ఏఎ్‌సఐ సర్వేకు గత ఏడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపిన ఏఎ్‌సఐ తన నివేదికను కోర్టుకు డిసెంబరు 18న సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ, ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు అందుకు అంగీకరించటంతో కక్షిదారులకు నివేదిక ప్రతులను అందించారు.

Updated Date - Jan 26 , 2024 | 07:09 AM

Advertising
Advertising