అదానీపై కేసు నిలబడకపోవచ్చు: రవి బాత్రా
ABN, Publish Date - Nov 27 , 2024 | 02:44 AM
గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన ‘లంచం’ కేసు నిలబడకపోవచ్చని ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా అన్నారు.
న్యూయార్క్, నవంబరు 26: గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన ‘లంచం’ కేసు నిలబడకపోవచ్చని ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా అన్నారు. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు దాదాపు రూ.2029 కోట్ల లంచాలు ఇవ్వజూపారంటూ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు, ఎస్‌ఈసీ నేరారోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై చేసిన ఆరోపణలు ‘అయోగ్యమైన లేదా లోపభూయిష్టమైనవి’గా తేలితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని రవి బాత్రా అన్నారు. ఇక ఈ లంచం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ, సాగర్ అదానీ తదితరులు అమెరికాలో నివసించడం లేదని గుర్తుచేశారు. ‘అమెరికా చట్టాలను ఇతర దేశాల్లో ఎలా అమలు చేయాలన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది’ అని బాత్రా పేర్కొన్నారు.
Updated Date - Nov 27 , 2024 | 02:45 AM