ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: ప్రధాని ప్రాణప్రతిష్ట చేస్తున్నప్పుడు.. మేము బయట కూర్చొని చప్పట్లు కొట్టాలా?

ABN, Publish Date - Jan 15 , 2024 | 05:49 PM

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము హాజరుకావడం లేదని నలుగురు శంకరాచార్యులు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో.. ఇందుకు గల కారణాలు ఏంటి? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద ఆ ఉత్కంఠకు తెరదించారు.

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము హాజరుకావడం లేదని నలుగురు శంకరాచార్యులు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో.. ఇందుకు గల కారణాలు ఏంటి? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రాణ ప్రతిష్టకు వెళ్లకూడదన్న నిర్ణయం తమ అహానికి సంబంధించింది కాదని, ఇది సంప్రదాయానికి చెందిందని తెలిపారు. సనాతన సంప్రదాయానికి విరుద్ధం కాబట్టే.. తాము ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు.


‘‘శంకరాచార్యులందరికీ తమకంటూ ఆత్మగౌరవం ఉంది. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు. రామ మందిరంలో ప్రధానమంత్రి ప్రాణప్రతిష్ట చేస్తున్నప్పుడు.. మేమంతా బయట కూర్చొని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా? సంప్రదాయాలను తారుమారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదు’’ అని స్వామి నిశ్చలానంద చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. జనవరి 22వ తేదీన రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అది సరైన తేదీ కాదని, ప్రాణప్రతిష్ట లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున నిర్వహించాలని అన్నారు.

మరోవైపు.. శంకరాచార్య అభిప్రాయాలను ఉటంకిస్తూ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆలయ నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, అసంపూర్ణమైన ఆలయంలో ప్రాణప్రతిష్ట చేయడం సనాతన ధర్మ సంప్రదాయానికి విరుద్ధమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఈ మొత్తం కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా.. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 10 వేల మందిని హాజరుకానున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించారు.

Updated Date - Jan 15 , 2024 | 05:49 PM

Advertising
Advertising