ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వయనాడ్‌ నుంచి ప్రియాంక పోటీ

ABN, Publish Date - Oct 16 , 2024 | 01:36 AM

వయనాడ్‌ లోక్‌సభ సీటుకు ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం ప్రకటించిన ఎన్నికల కమిషన్‌, వయనాడ్‌ లోక్‌సభ సీటుతో పాటు 47 అసెంబ్లీ

వయనాడ్‌ నుంచి ప్రియాంక పోటీ

న్యూఢిల్లీ, అక్టోబరు 15: వయనాడ్‌ లోక్‌సభ సీటుకు ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం ప్రకటించిన ఎన్నికల కమిషన్‌, వయనాడ్‌ లోక్‌సభ సీటుతో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 13న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆ వెంటనే వయనాడ్‌ సీటుకు ప్రియాంక అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. రాహుల్‌గాంధీ వయనాడ్‌(కేరళ) సీటును వదులుకొని రాయ్‌బరేలీ(యూపీ) లోక్‌సభ స్థానానికే ప్రాతినిధ్యం వహిస్తారని పార్టీ గతంలోనే తెలిపింది. కాగా, వయనాడ్‌లో గనక ఆమె గెలిస్తే.... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(సోనియా, రాహుల్‌, ప్రియాంక) మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యులుగా ఉంటారు.

Updated Date - Oct 16 , 2024 | 01:36 AM