2,155 కోట్లతో భద్రాచలం, కొవ్వూరు రైల్వేలైన్: కేంద్రం
ABN, Publish Date - Dec 12 , 2024 | 04:44 AM
తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రలోని కొవ్వూరు(119 కి.మీ) మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును మంజూరు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రలోని కొవ్వూరు(119 కి.మీ) మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును మంజూరు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Updated Date - Dec 12 , 2024 | 04:45 AM