ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Satyendra Jain: జైలులో దోపిడీ రాకెట్.. సత్యేంద్ర జైన్‌‌పై‌‌ సీబీఐ విచారణకు హోం శాఖ గ్రీన్‌సిగ్నల్

ABN, Publish Date - Mar 29 , 2024 | 08:03 PM

మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న 'ఆప్' నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి సత్యేంద్ర జైన్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తీహార్ జైలులో ఉన్న కాన్‌మన్ సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandrashekhar) నుంచి రక్షణ సొమ్ముగా ఆయన రూ.10 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక (POC) చట్టం కింద సీబీఐ (CBI) విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న 'ఆప్' నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి సత్యేంద్ర జైన్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తీహార్ జైలులో ఉన్న కాన్‌మన్ సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandrashekhar) నుంచి రక్షణ సొమ్ముగా ఆయన రూ.10 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక (POC) చట్టం కింద సీబీఐ (CBI) విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.


ఏమిటీ దోపిడీ కేసు?

సుఖేష్ చంద్రశేఖర్ నుంచి రూ.10 కోట్లు ఎక్స్‌టార్షన్ సొమ్ముగా జైన్ తీసుకున్నారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. తీహార్ జైలు నుంచి జైన్, ఆ జైలు మాజీ డీజీ సందీప్ గోయెల్ కలిసి దోపిడీ రాకెట్ నడిపించారని, మనీలాండరింగ్ కేసులో జైన్ తీహార్ జైలులో ఉన్నప్పుడు రక్షణ సొమ్ముగా తనను రూ.10 కోట్లు డిమాండ్ చేశారని సుఖేష్ చంద్రశేఖర్ గతంలో ఫిర్యాదు చేశారు. జైన్ 2018-2021 మధ్య పలు వాయిదాలలో రూ.10 కోట్ల రక్షణ సొమ్ము తీసుకున్నాడని ఆరోపించారు. జైన్, ఇతర తీహార్ జైలు అధికారులు డబ్బులు తీసుకుని తమ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేసేవారని, జైలులో ఉన్న వారికి జైలు నిబంధనావళికి భిన్నంగా అనేక సౌకర్యాలు కల్పించేవారని అన్నారు. ఈ మేరకు ఎల్జీకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పీఓసీ చట్టం కింద జైన్‌పై సీబీఐతో విచారణ జరపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 08:37 PM

Advertising
Advertising