మత్స్యకారుల భద్రతకు ఇస్రో ‘డీఏటీ-ఎస్‌జీ’
ABN, Publish Date - Jan 18 , 2024 | 02:58 AM
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ బోట్ల నుంచి అత్యవసర సందేశాలు పంపించడానికి, వారు సముద్రంలో ఎక్కడ ఉన్నారో రియల్ టైమ్‌లో గుర్తించడానికి వీలుగా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది.
రెండో తరం ‘డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్‌మిటర్’ అభివృద్ధి
బెంగళూరు, జనవరి 17: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ బోట్ల నుంచి అత్యవసర సందేశాలు పంపించడానికి, వారు సముద్రంలో ఎక్కడ ఉన్నారో రియల్ టైమ్‌లో గుర్తించడానికి వీలుగా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. శాటిలైట్ కమ్యూనికేషన్, నావిగేషన్ సామర్థ్యం కలిగిన రెండో తరం ‘డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్‌మిటర్’ (డీఏటీ-ఎ్‌సజీ)ని రూపొందించింది. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మత్స్యకారులు అత్యవసర సందేశాలు పంపితే, సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ వాటిని అందుకుని డీకోడ్ చేస్తుందని.. తద్వారా ఆయా బోట్లు ఎక్కడున్నాయో గుర్తించవచ్చని ఇస్రో పేర్కొంది. అలా సేకరించిన సమాచారాన్ని కోస్టు గార్డు టీమ్‌లకు పంపిస్తే ఆపదలో ఉన్న మత్స్యకారులను కాపాడడం తేలికవుతుందని వెల్లడించింది. డీఏటీ పరికరాలు 2010 నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ.. శాటిలైట్ కమ్యూనికేషన్, నావిగేషన్‌లో అందుబాటులోకొచ్చిన అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్న ఇస్రో.. రెండో తరం డీఏటీ-ఎ్‌సజీని అభివృద్ధి చేసింది. సముద్రం నుంచి హెచ్చరిక సందేశాలు పంపే మత్స్యకారులకు తిరిగి జవాబు పంపే సదుపాయం డీఏటీ-ఎ్‌సజీలో ఉంటుంది.
Updated Date - Jan 18 , 2024 | 09:08 AM