ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:01 AM

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌ను చెన్నైలో ఏర్పాటు చేసింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 15: భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌ను చెన్నైలో ఏర్పాటు చేసింది. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎండీఆర్‌ఎఫ్‌) సహకారంతో దీన్ని ప్రారంభించింది. శాస్త్రీయ అధ్యయనాలకు ఉపయోగపడే జీవ నమూనాలను సేకరించడం, వాటిని ప్రాసెస్‌ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం ఈ బయోబ్యాంక్‌ లక్ష్యం. మధుమేహానికి కారణాలు, భారతీయుల్లో ఎక్కువగా వచ్చే వైవిధ్యాలు, వాటి ద్వారా వచ్చే రుగ్మతలపై అధునాతన పరిశోధనలకు ఈ బయోబ్యాంక్‌ దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ బయోబ్యాంకులో ఐసీఎంఆర్‌ నిధులతో నడిచే రెండు సంస్థలతోపాటు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరించి వాటిపై పరిశోధనలు చేస్తారు.

Updated Date - Dec 16 , 2024 | 04:01 AM