ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇమ్రాన్‌ఖాన్‌ విడుదలకు ఇస్లామాబాద్‌ ముట్టడి

ABN, Publish Date - Nov 26 , 2024 | 02:54 AM

జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో సోమవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ ముట్టడికి యత్నించారు.

ఇస్లామాబాద్‌, నవంబరు 25: జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో సోమవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ ముట్టడికి యత్నించారు. ఖైబార్‌ పక్తుంత్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ గండాపూర్‌, ఇమ్రాన్‌ఖాన్‌ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) ఆందోళనకారులు ఇస్లామాబాద్‌ వైపు దూసుకురావడంతో పోలీసులు ఆ నగరంలోకి ప్రవేశించే మార్గాలన్నీ మూసేసి భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఓ పోలీసు మృతి చెందగా పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. ఐదుగురు ఎంపీలు సహా దాదాపు 4వేల మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని పంజాబ్‌ ప్రావిన్సు భద్రతాధికారి షాహిద్‌ నవాజ్‌ తెలిపారు.

Updated Date - Nov 26 , 2024 | 02:54 AM