ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్య బీమా తీసుకుంటే చాలు ఏ ఆస్పత్రిలోనైనా నగదు రహిత చికిత్స!

ABN, Publish Date - Jan 26 , 2024 | 04:57 AM

మీరు ఆరోగ్య బీమా తీసుకున్నారా? చికిత్స కోసం సదరు బీమా కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికే వెళ్లాల్సిన పని లేదు. జాబితాలో లేని ఆస్పత్రికి వెళితే ఇన్సూరెన్స్‌ వర్తించదేమోనన్న కంగారూ అక్కర్లేదు. అది ఏ కంపెనీ అయినా సరే, మీరు ఆరోగ్య బీమా

ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం

గురువారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి

న్యూఢిల్లీ, జనవరి 25: మీరు ఆరోగ్య బీమా తీసుకున్నారా? చికిత్స కోసం సదరు బీమా కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికే వెళ్లాల్సిన పని లేదు. జాబితాలో లేని ఆస్పత్రికి వెళితే ఇన్సూరెన్స్‌ వర్తించదేమోనన్న కంగారూ అక్కర్లేదు. అది ఏ కంపెనీ అయినా సరే, మీరు ఆరోగ్య బీమా తీసుకుంటే చాలు.. నెట్‌వర్క్‌ జాబితాలో పొందుపర్చిన ఆస్పత్రులు సహా ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌’ (నగదు రహిత చికిత్స) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు సంబంధించి మెడికల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల సౌజన్యంతో ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌’ కీలక నిర్ణయం వెలువరించింది. ఇక నుంచి అన్ని ఆస్పత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌’ సదుపాయం లభిస్తుందని, ఇది గురువారం (జనవరి 25) నుంచే అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. ఇప్పటిదాకా ఏదైనా హెల్త్‌ పాలసీ తీసుకుంటే.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌’కు అనుమతి ఉండేది. నెట్‌వర్క్‌యేతర ఆస్పత్రిలోనైతేచికిత్సకు ఎంత ఖర్చయితే అంత రోగి సొంతంగా చెల్లించుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత చికిత్స ఖర్చులను బీమా కంపెనీ నుంచి పొందేందుకు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఈ దరఖాస్తుకు వైద్య చికిత్సకు సంబంధించి పత్రాలు, బిల్లుల రూపంలో పెద్ద ఫైలునే జతచేసి ఇవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియంతా కూడా సుదీర్ఘంగానూ.. సంక్లిష్టంగానూ ఉండేది. అయితే ఇకనుంచి ఈ తలనొప్పులు తప్పనున్నాయి. క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌పై కీలక నిర్ణయం వెలువడిన అనంతరం బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ తపన్‌ సింఘేల్‌ స్పందించారు. బీమా పాలసీదారులకు చికిత్సను సులభతరం చేసేందుకే అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

Updated Date - Jan 26 , 2024 | 04:57 AM

Advertising
Advertising