ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య

ABN, Publish Date - Oct 14 , 2024 | 06:00 AM

మాజీ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (అజిత్‌ పవార్‌)కి చెందిన నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ముంబైలో ఆయనను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. బాబా శనివారం రాత్రి బాంద్రాలోని

ముంబైలో కాల్చి చంపిన ముగ్గురు వ్యక్తులు..

కుమారుడి కార్యాలయం వద్ద ఉండగా ఘటన

తమ పనేనన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌

ముంబై, అక్టోబరు 13: మాజీ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (అజిత్‌ పవార్‌)కి చెందిన నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ముంబైలో ఆయనను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. బాబా శనివారం రాత్రి బాంద్రాలోని తన కుమారుడు, వాంద్రే ఎమ్మెల్యే అయిన జీషన్‌ సిద్దిఖీ కార్యాలయం వద్ద ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబా సిద్దిఖీ (66) మంత్రిగా పనిచేశారు. గత రెండు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ సంవత్సరం ఎన్సీపీలో చేరారు. ముంబైలో ముస్లిం నాయకుడిగా బాగా పలుకుబడి కలిగిన సిద్దిఖీ.. బాలీవుడ్‌ స్టార్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితులు. ఓ దశలో తీవ్ర విభేదాలతో కనీసం పలకరింపులు లేని సల్మాన్‌-షారూక్‌ ఖాన్‌ మధ్య సయోధ్య కుదిర్చింది సిద్దిఖీనే. సంజయ్‌ దత్‌ సహా పలువురు నటీ నటులతోనూ ఆయకు దగ్గరి సంబంధాలున్నాయి. ఈయన ఇచ్చే భారీ ఇఫ్తార్‌ విందులకు బాలీవుడ్‌ నటులు పెద్దఎత్తున తరలివచ్చేవారు. కాగా, సిద్దిఖీపై కాల్పులకు పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని పట్టుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో గుర్మైల్‌(23) హరియాణాకు చెందినవాడు. మిగతా ఇద్దరు యూపీ వాసులైన ధర్మరాజ్‌(19), శివకుమార్‌. శివకుమార్‌ పరారీలో ఉన్నాడు. హత్యకు కుట్రదారులుగా, నిందితులకు సాయపడినవారిగా భావిస్తున్నవారిలో ప్రవీణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్తర్‌ కోసం గాలిస్తున్నారు. అయితే, ధర్మరాజ్‌ వయసు ఆధార్‌ ప్రకారం 21గా ఉన్నప్పటికీ.. అతడు మైనర్‌ (17)నని పేర్కొనడంతో వయసు నిర్ధారణ పరీక్షలకు కోర్టు ఆదేశించింది. మరోవైపు సిద్దిఖీ హత్యకు కొన్ని నెలలుగా నిందితులు ప్రణాళికలు రచించారని, ముంబై, పుణెలలో నివాసం ఉన్నారని, సిద్దిఖీ ఇల్లు, కార్యాలయంపై నిఘా పెట్టారని పోలీసులు తెలిపారు. హత్యకు గాను రూ.50 వేల అడ్వాన్స్‌ తీసుకున్నారని, ఆయుధాలను బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సరఫరా చేసిందని పేర్కొన్నారు. సిద్దిఖీ హత్య తమ పనే అని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ మేరకు గ్యాంగ్‌ సభ్యుడొకరు ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. సల్మాన్‌తో పాటు దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నందుకే అతడిని హతమార్చినట్లు పేర్కొంది. సిద్ధిఖీ హత్యతో సల్మాన్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు. సల్మాన్‌ ఆదివారం సాయంత్రం సిద్దిఖీ ఇంటికెళ్లి భౌతిక ఖాయానికి నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శనివారం సల్మాన్‌ బిగ్‌ బాస్‌ షూటింగ్‌ రద్దుచేసుకుని ఆస్పత్రిలో సిద్ధిఖీ మృతదేహాన్ని సందర్శించారు.


20 ఏళ్లకే రాజకీయాల్లోకి

సిద్దిఖీ 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. అసలు పేరు జియాఉద్దీనన్‌ సిద్ధిఖీ. 1999 నుంచి వరుసగా మూడుసార్లు బాంద్రా వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో కార్మిక, పౌర సరఫరాలు తదితర శాఖల మంత్రిగా నియమితులయ్యారు. ఈ సమయంలోనే ముంబైలోని ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు ఇళ్ల కేటాయింపు రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు 2014లో సిద్దిఖీపై ఈడీ కేసు నమోదైంది. కాగా, వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా సిద్దిఖీ హత్య సంచలనంగా మారింది. సిద్దిఖీ హత్యను ఖర్గే, రాహుల్‌ గాంధీ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని శరద్‌ పవార్‌ ఆరోపించగా ఘటనను రాజకీయం చేయొద్దని ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కోరారు.

Updated Date - Oct 14 , 2024 | 06:00 AM