ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: రేపటినుంచి పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:43 AM

స్థానిక జీఎన్‌ చెట్టిరోడ్డులో వున్న పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 28న బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

- సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌

చెన్నై: స్థానిక జీఎన్‌ చెట్టిరోడ్డులో వున్న పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 28న బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 9-11.30 గంటల మధ్య కుంకుమార్చన, సాయంత్రం 6.30-8.00 గంటల మధ్య విష్వక్సేన ఆరాధన అంకురార్పణ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఉదయం 8-11.30 గంటల మధ్య ధ్వజారోహణం జరగనుండగా, సాయంత్రం 7 గంటలకు చిన్న శేషవాహనంపై తాయారు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే విధంగా 29న ఉదయం 9 గంటలకు పెద్ద శేష వాహనం, సాయంత్రం 7 గంటలకు హంస వాహనం, మార్చి 1వ తేదీన ఉదయం 9 గంటలకు ముత్యపు పందిరి, సాయంత్రం 7 గంటలకు సింహవాహనం, 2వ తేదీన ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 7 గంటలకు హనుమంత వాహనం, 3వ తేదీన ఉదయం 9 గంటలకు పల్లకి ఉత్సవం, సాయంత్రం 7 గంటలకు గజ వాహనం, 4న ఉదయం 9 గంటలకు సర్వభూపాల వాహనం, సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనం, 5న ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనం, 6న ఉదయం 9 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు అశ్వవాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. 7వ తేదీ ఉదయం 9 గంటలకు చక్రస్నానం, 8న ఉదయం 9 గంటలకు పుష్పయాగం జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం జీఎన్‌ చెట్టిరోడ్డు, బోగ్‌రోడ్‌, విజయరాఘవరోడ్డు, నాయర్‌ రోడ్డుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమిళనాడు,పుదుచ్చేరి ఆలయాల సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మండలి ఉపాధ్యక్షుడు శరణ్‌రెడ్డి, సభ్యులు బి.మోహన్‌రావు, పీవీ కృష్ణారావు, కె.అనిల్‌కుమార్‌రెడ్డి, కిశోర్‌, కార్తికేయన్‌, జయదేవ్‌, టీటీడీ సూపరింటెండెంట్‌ పుష్పలత తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఉదయం, సాయంత్రం అన్నదానం నిర్వహించనున్నామని, అదే విధంగా ప్రసాదాల వితరణ కూడా ఉంటుందన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రత్యేక పోలీసు భద్రత కూడా ఏర్పాటు కానుందని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం పలువురు కళాకారులు పెరుమాళ్‌, తాయారు కీర్తనలు ఆలపించనున్నారని పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:43 AM

Advertising
Advertising