ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hardeep Nijjar Case: హర్దీప్ నిజ్జర్ హత్య కేసు.. కీలక వివరాలు వెలుగులోకి!

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:15 PM

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కెనడాకు చెందిన ఒక ఉన్నాతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో కెనడాతో భారత్ సహకరిస్తోందని తెలిపారు.

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కెనడాకు చెందిన ఒక ఉన్నాతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో కెనడాతో భారత్ సహకరిస్తోందని తెలిపారు. మాజీ నేషనల్ సెక్యూరిటీ & ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన పదవి నుంచి రిటైర్ అయిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ హర్దీప్ నిజ్జర్ హత్య గురించి మాట్లాడారు.


‘‘హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పూర్తిగా సహకరిస్తోంది. ఈ కేసు కారణంగా దెబ్బతిన్న భారత్, కెనడా దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పురోగతి సాధిస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఈ కేసును పరిష్కరించేందుకు భారత్ మాతో కలిసి పని చేస్తోంది. ఈ కేసుని ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది’’ అని జోడీ థామస్ చెప్పుకొచ్చారు. అలాగే.. ఇండో-పసిఫిక్‌లో ప్రాంతంలో తమ ప్రభావం విస్తరించడం అనేది, భారత్‌తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా తాము పని చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. కెనడా, భారత్ మధ్య నెలకొన్న దౌత్య వివాదం మెల్లమెల్లగా సమసిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన.. ఇరుదేశాల మధ్య ఫ్రీ-ట్రేడ్ డీల్ కూడా కుదిరే అవకాశం ఉందని ఆశించొచ్చు.

ఇదిలావుండగా.. గతేడాది జూన్ 18వ తేదీన కొలంబియాలోని సర్రే నగరంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో.. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలు చేసిన వెంటనే.. నిజ్జర్ హత్యలో అధికారిక ప్రభుత్వ పాత్ర లేదని భారత్ ఖండించింది. అదే సమయంలో ఇరుదేశాలు పరస్పర రాయబారుల్ని బహిష్కరించాయి. అలాగే.. తన దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీ కోరడంతో, కెనడా భారతదేశం నుండి 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది.

Updated Date - Jan 27 , 2024 | 09:15 PM

Advertising
Advertising