ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LATAM Airline: ప్రయాణికులకు నరకం చూపించిన విమానం.. సీలింగ్‌పై రక్తం.. ఏకంగా 50 మంది..

ABN, Publish Date - Mar 11 , 2024 | 05:00 PM

ఒక విమానం తన ప్రయాణికులకు నరకం చూపించింది. గాల్లో ఉన్నప్పుడు పెను విధ్వంసం సృష్టించి, ఏకంగా 50 మందిని గాయపరిచింది. విమానం సీలింగ్‌పై రక్తపు మరకలు ఏర్పడ్డాయంటే.. ప్రయాణికులు ఎలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కున్నారో అర్థం చేసుకోవచ్చు. లటమ్‌ ఎయిర్‌లైన్స్‌ (LATAM Airlines)కు చెందిన ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక విమానం తన ప్రయాణికులకు నరకం చూపించింది. గాల్లో ఉన్నప్పుడు పెను విధ్వంసం సృష్టించి, ఏకంగా 50 మందిని గాయపరిచింది. విమానం సీలింగ్‌పై రక్తపు మరకలు ఏర్పడ్డాయంటే.. ప్రయాణికులు ఎలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కున్నారో అర్థం చేసుకోవచ్చు. లటమ్‌ ఎయిర్‌లైన్స్‌ (LATAM Airlines)కు చెందిన ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sydney) నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు (Auckland) ఎల్‌ఏ800 బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్ విమానం బయలుదేరింది. ఇది గాల్లోకి ఎగిరిన తర్వాత కొద్దిసేపటి వరకూ సురక్షితంగానే ప్రయాణాన్ని కొనసాగించింది. దీంతో ప్రయాణికులు తమ సీటు బెల్టు తొలగించి, తాపీగా కూర్చున్నారు. కానీ, ఇంతలోనే ఒక సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానం బలమైన కుదుపులకు లోనైంది. ఈ దెబ్బకు ప్రయాణికుల్లో చాలామంది సీలింగ్‌వైపు విసిరివేయబడ్డారు. ఈ ఘటన ఏకంగా 50 మంది గాయపడ్డారు.


విమానంలో తలెత్తిన సమస్యను గుర్తించిన సిబ్బంది.. వెంటనే అప్రమత్తమైంది. ల్యాండ్ అవ్వడానికి ముందే న్యూజిలాండ్‌లోని వైద్య బృందాలకు సమాచారం అందించడంతో, ఐదు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఇక ఆక్లాండ్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత.. 50 మందిలో తీవ్రంగా గాయపడిన 13 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది (ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది) పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై లటమ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి తాము బాధపడుతున్నామని తెలిపింది. ఆపరేషనల్‌ ప్రమాణాలకు లోబడి.. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. అయితే.. ఈ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏంటో ఎయిర్‌లైన్ వివరించలేదు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. మరోవైపు.. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తాము భయబ్రాంతులకు గురయ్యామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 05:00 PM

Advertising
Advertising