ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ghee: రోజూ నెయ్యి తింటే బరువు తగ్గుతారా? నిపుణులు చెబుతున్నది ఇదే!

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:36 PM

నెయ్యితో బరువు పెరగడమే కాకుండా అవసరమనుకుంటే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు నెయ్యి (Ghee) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెయ్యితో ఫుడ్ మరింత రుచిగా మారడంతో పాటూ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే పెద్దలు రోజూ నెయ్యి తినాలని చెబుతుంటారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ ఏ,డీ, ఈ, కే విటమిన్లు ఉంటాయి. ఇందులో ఉండే ఎసెంన్షియల్ ఫ్యాటీ యాసిడ్లతో మెదడు ఆరోగ్యం, హార్మోన్లపై నియంత్రణ మెరుగవుతుంది. అయితే, నెయ్యికి బరువును పెంచడంతో (Weight Gain) పాటూ తగ్గించే (Weight Loss) గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు నియంత్రణ ఇలా..

నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని శరీరం త్వరితగతిన శక్తిగా మార్చుకోగలదు. దీంతో, శరీరంలోని కొవ్వులు త్వరగా ఖర్చైపోతాయి. అంతే కాకుండా, నెయ్యిలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్..ఒంట్లోని కొవ్వును తగ్గించి కండరాల పుష్టి చేకూరుస్తుంది. అయితే, పరిమితికి లోబడి నెయ్యి తింటేనే ఈ ప్రయోజనాలు చేకూరతాయి.

నెయ్యికి జీవక్రియలను వేగవంతం చేసే శక్తి ఉంది. ఇందులోని మీడియం చైన్ ఫ్యాటీయాసిడ్స్ శరీరంలోని కొవ్వులు త్వరగా ఖర్చయ్యేలా చేయగలవు. ఫలితంగా బరువు తగ్గుతారు.

నెయ్యి తిన్న వారికి ఆకలి త్వరగా వేయదు. దీంతో, ఆహారం తక్కువగా తింటారు. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్..కడుపు నిండిందన్న భావన కలుగ చేసే హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి.

షుగర్ స్థాయిల నియంత్రణ

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. చెక్కర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది. ఫలితంగా ఏదో తినాలన్న ఆలోచన తగ్గుతుంది. దీంతో, బరువు దానంతట అదే నియంత్రణలోకి వస్తుంది.

నెయ్యిలో ఉండే కొన్ని విటమిన్లు ఆహారంలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించేలా చేస్తాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడి బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.

నెయ్యిలో కేలొరీలు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఆ మాటకొస్తే కేలొరీలు అధికంగా ఉండే ఏ ఆహారమైనా బరువు పెరిగేలా చేస్తుంది.

Updated Date - Jan 27 , 2024 | 09:36 PM

Advertising
Advertising