ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight gain: అలర్ట్! మహిళలూ.. వయసు 40 దాటిందా? అయితే..

ABN, Publish Date - Jan 30 , 2024 | 07:40 PM

వయసు 40 దాటి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు పాటించాల్సిన కొన్ని పరిష్కారాలు

ఇంటర్నెట్ డెస్క్: వయసు 40 దాటిందంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జీవక్రియలు నెమ్మదించడం, హార్మోన్ల మార్పులు వంటివి మొదలవుతాయి. ఫలితంగా, మహిళల్లో కొందరు బరువు కూడా పెరుగుతారు. ఇది ఒక్కోసారి అదుపు తప్పినట్టు కూడా అనిపిస్తుంది. పరిస్థితిని అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది. అయితే, జీవనశైలిలో కొన్ని ముఖ్య మార్పులు చేస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చని వైద్యులు చెబుతున్నారు.

వెయిట్ ట్రెయినింగ్..

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ మసిల్ మాస్ అంటే కండరాల్లో క్షీణత వస్తుంది. ఫలితంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి. అయితే, కసరత్తులు చేసేటప్పుడు వెయిట్ ట్రెయినింగ్‌పై దృష్టి పెడితే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వంటి వాటితో ఎక్సర్‌సైజులు చేస్తే కండరాల పటుత్వం పెరుగుతుంది. ఫలితంగా, జీవక్రియలు వేగవంతమై, ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. దేహదారుఢ్యం ఇనుమడిస్తుంది.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్

మజిల్ మాస్ పెంచేందుకు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ కూడా అనువైన విధానమని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపు తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఆ తరువాత కాసేపు విరామం తీసుకోవాలి. మళ్లీ ఇదే విధంగా కసరత్తు కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల కెలొరీలు వేగంగా ఖర్చవుతాయి. కసరత్తులు పూర్తయ్యాక కూడా కెలొరీల వినియోగం కొనసాగి బరువు నియంత్రణలోకి వస్తుంది.

శరీరానికి తగినంత నిద్ర..

శరీరానికి కావాల్సినంత నిద్ర ఉంటేనే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కానీ నిద్ర విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. రోజుకు 7 నుంచి 9 గంటల పాటు ఆటంకాలు లేని నిద్ర బరువు నియంత్రణకు కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఆహారపు అవాట్లలో మార్పులు..

వయసు పెరిగే కొద్దీ జీవక్రియలు నెమ్మదిస్తాయి కాబట్టి తిండి విషయంలో నియంత్రణ అవసరం. పరిమితంగా తినడంపై దృష్టిపెట్టడంతో పాటూ తినేటప్పుడు హడావుడి లేకుండా జాగ్రత్తగా ఆస్వాదిస్తూ తినడం కూడా బరువు నియంత్రణకు అవసరం

హైడ్రేషన్..

ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. బరువు నియంత్రణకూ ఇది కీలకం. నీరు తగినంత ఉంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది. ఇక కూల్‌ డ్రింక్స్ వంటి వాటి బదులు హెర్బల్ టీ లాంటి ప్రత్యామ్నాయాలవైపు మళ్లితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్

తరచూ ఒత్తిడికి లోనయ్యే వారి బరువు క్రమంగా పెరుగుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. కాబట్టి, 40 ఏళ్లు దాటిన మహిళలు ఒత్తిడి తగ్గించుకునేందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. యోగా, శ్వాస ఎక్స్‌ర్‌సైజులు, నచ్చిన వ్యాపకాల్లో పాల్గొనడంతో మానసికోల్లాసం కలిగి ఒత్తిడి తగ్గుతుంది.

Updated Date - Jan 30 , 2024 | 07:52 PM

Advertising
Advertising