కవిగారి జాడ
ABN, Publish Date - Jan 29 , 2024 | 04:52 AM
ఊరు భాషలో ఊరు యాసలో ఊరు గురించి కవిత్వం రాసే ఓ కవి తన కవిత్వం వినిపించడానికి మహానగరానికి వెళ్ళాడు...
ఊరు భాషలో ఊరు యాసలో
ఊరు గురించి కవిత్వం రాసే
ఓ కవి
తన కవిత్వం వినిపించడానికి
మహానగరానికి వెళ్ళాడు
ఆ కవి తిరిగి ఊరికి
ఎప్పుడొస్తాడో తెలీదు
ఇక్కడ ఊర్లో
పరాయితనం
ముళ్ళకంపలా బ్రహ్మజెముడులా
మొలిచి విస్తరిస్తోంది
రంగులు హంగులు పొంగులు
పొర్లీ పొర్లీ
చెట్టూ చెరువూ చెలిమి
చెల్లా చెదురవుతున్నాయి
పాపం కవి
ఈ దారెంటే వెళ్ళాడు
ఎప్పుడు ఎట్లా తిరిగొస్తాడో
ఇంతలో
ఊర్లో నుంచి కవితొకటి
కవిగారి జాడలో నగరం
దారి వెతుక్కుంటూ వెళ్లింది
వారాల ఆనంద్
Updated Date - Jan 29 , 2024 | 04:52 AM