ఈసారీ వడ్డీ రేట్లు యథాతథమే!
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:46 AM
దేశంలో కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే సూచనాలు కనిపించడం లేదు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన...
నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: దేశంలో కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే సూచనాలు కనిపించడం లేదు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలోనూ కీలక రెపో రేటు తగ్గించే అవకాశం లేదని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నెల 9న (బుధవారం) ఆర్‌బీఐ గవర్నర్ దాస్.. ఎంపీసీ భేటీ వివరాలను మీడియాకు వివరిస్తారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే డిసెంబరులో జరిగే ఎంపీసీ సమావేశంలోనే రెపో రేటు పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
Updated Date - Oct 07 , 2024 | 03:46 AM