ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఎంఎఫ్‌’ ఆస్తులు.. రూ.50 లక్షల కోట్లు

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:09 AM

గత ఏడాది (2023).. మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)లోకి పెట్టుబడులు వెల్లువెత్తడం తో పరిశ్రమ ఆస్తులు రూ.11 లక్షల కోట్ల మేర పెరిగి రూ.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి...

న్యూఢిల్లీ: గత ఏడాది (2023).. మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)లోకి పెట్టుబడులు వెల్లువెత్తడం తో పరిశ్రమ ఆస్తులు రూ.11 లక్షల కోట్ల మేర పెరిగి రూ.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ఈక్విటీ మార్కెట్లు ఆశావహంగా ఉండడం, ఆర్థిక స్థిరత్వం పై ఏర్పడిన చైతన్యం, శక్తివంతమైన ఆర్థిక వృద్ధి ఇందుకు దోహదపడ్డాయి. తక్కువ వ్యయంతో దీర్ఘకాలిక సంపద సృష్టికి మార్గాలు అందించగల తన సామర్థ్యాన్ని ఎంఎఫ్‌ పరిశ్రమ నిరూపించుకోగలిగిందని, అదే ఈ విజయానికి కారణమని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ అసోసియేషన్‌ (ఏఎంఎ్‌ఫఐ) తెలిపింది. దేశంలో ఎంఎఫ్‌ల ఆస్తుల విలువ పెరగడం వరుసగా ఇది 11వ సంవత్సరం.

  • 2023లో ఎంఎ్‌ఫలలోకి రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రధానంగా సిస్టమాటిక్‌ పెట్టుబడి ప్లాన్లు (సిప్‌) రూ.1.84 లక్షల కోట్ల నిధులు ఆకర్షించాయి.

  • ఈ నిధుల రాకతో ఎంఎఫ్‌ పరిశ్రమ వద్ద నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 27 శాతం పెరిగి రూ.10.9 లక్షల కోట్లు జోడయింది. 2022లో నమోదు చేసిన 5.7 శాతం వృద్ధి, రూ.2.65 లక్షల కోట్ల ఏయూఎంల పెరుగుదల కన్నా ఇది చాలా అధికం.

  • ఎంఎ్‌ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ 2022లో రూ.39.88 లక్షల కోట్లు కాగా 2023 ముగిసే నాటికి రూ.50.78 లక్షల కోట్లకు పెరిగింది.

  • ఎంఎఫ్‌ సంస్థల ఏయూఎం తొలి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరడానికి సుమారు 50 సంవత్సరాలు పట్టగా రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్లకు చేరడానికి కేవలం ఏడాది పట్టింది.

  • జూ సిప్‌ల పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు అధికంగా మొగ్గు చూపారు. 2023లో సిప్‌లలోకి రూ.1.84 లక్షల కోట్ల నిధులు వచ్చాయి.

  • ఆటుపోట్లు అధికంగా ఉన్న, ప్రతికూల ఆర్థిక వాతావరణంలో బంగారం పెట్టుబడికి చక్కని రక్షణ కల్పిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తారు. ఈ కారణంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి రూ.2,200 కోట్లు వచ్చాయి..

Updated Date - Jan 09 , 2024 | 03:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising