టెక్ వ్యూ ప్రధాన నిరోధం 22000
ABN, Publish Date - Jan 15 , 2024 | 03:33 AM
నిఫ్టీ గత వారం బలమైన రియాక్షన్‌లో ప్రారంభమైనా ప్రధాన నిరోధం 21500 కన్నా పైన రికవరీ సాధించి మరింత పురోగమించింది. చివరి రెండు రోజుల్లో మరింత బలమైన రికవరీతో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 21830ని కూడా ఛేదించి...
టెక్ వ్యూ
ప్రధాన నిరోధం 22000
నిఫ్టీ గత వారం బలమైన రియాక్షన్‌లో ప్రారంభమైనా ప్రధాన నిరోధం 21500 కన్నా పైన రికవరీ సాధించి మరింత పురోగమించింది. చివరి రెండు రోజుల్లో మరింత బలమైన రికవరీతో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 21830ని కూడా ఛేదించి చివరికి 21900 సమీపంలో ముగిసింది. ప్రధాన ట్రెండ్ సానుకూలంగానే ఉన్నా కీలక మానసిక అవధి 22000కు సమీపంలో నిలిచి ఉండడం గమనించాల్సిన అంశం. నిఫ్టీ గత 12 వారాల్లో అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతూ 2300 పాయింట్ల వరకు లాభపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల మద్దతుతో గత వారం రికార్డు స్థాయిలకు దూసుకుపోయినా ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయి కన్నా పైనే ఉండడంపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ ఇప్పుడు మానసిక అవధి 22000 వద్ద పరీక్ష ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మరింత పై శిఖరాలకు నూతన గరిష్ఠ స్థాయిలకు పరుగులు తీస్తుంది.
బేరిష్ స్థాయిలు : 22000 వద్ద విఫలమైతే స్వల్ప అప్రమత్తతను సూచిస్తుంది. రియాక్షన్‌కు గురైనా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 21800 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 21500.
బ్యాంక్ నిఫ్టీ : గత నాలుగు వారాలుగా ఈ సూచీ మైనర్ కరెక్షన్‌లో ఉంది. గత వారం కీలక స్థాయి 47000 వద్ద రికవరీ సాధించినా 450 పాయింట్ల నష్టంతో 47700 సమీపంలో ముగిసింది. పాజిటివ్ ధోరణిలో ట్రేడయితే మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 48200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనత ప్రదర్శిస్తే దిగువన 47300, 47000 వద్ద మద్దతు ఉంది.
పాటర్న్ : 21800 వద్ద బ్రేకౌట్ సాధించినందు వల్ల పుల్‌బ్యాక్ రియాక్షన్ ఉండవచ్చు. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండా లి. 21800 వద్ద రెండు టాప్‌లను కలుపుతూ ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే అప్రమత్తం కాక తప్పదు.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 22000, 22080
మద్దతు : 21860, 21800
వి. సుందర్ రాజా
Updated Date - Jan 15 , 2024 | 03:33 AM