గూగుల్ పేతో విదేశాల్లోనూ చెల్లింపులు..
ABN, Publish Date - Jan 18 , 2024 | 05:11 AM
గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసె్‌సతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది...
ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసె్‌సతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూనిఫైడ్ పేమెంట్ సర్వీసె్‌స(యూపీఐ) ద్వారా చెల్లింపుల సేవలను విదేశాలకు విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. అంటే, భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడా గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వెంట నగదు తీసుకెళ్లాల్సిన లేదా అంతర్జాతీయ పేమెంట్ గేట్‌వేలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది.
Updated Date - Jan 18 , 2024 | 05:11 AM