15 నిమిషాల్లో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు
ABN, Publish Date - Oct 14 , 2024 | 01:50 AM
ఎంఎస్‌ఎంఈ రుణాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భావిస్తోంది. ఇందుకోసం వారి రుణ దరఖాస్తుల ఆమోద ప్రక్రియను...
ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈ రుణాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భావిస్తోంది. ఇందుకోసం వారి రుణ దరఖాస్తుల ఆమోద ప్రక్రియను మరింత త్వరితం చేస్తోంది. ఎంఎస్‌ఎం ఈల యజమానులు తమ ఎంఎస్‌ఎంఈల బ్రాంచీలకు వెళ్లి,..వారి పాన్ నంబరు, జీఎస్‌టీ డేటా వివరాలు అందిస్తే 15 నుంచి 45 నిమిషాల్లో వారి రుణ దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తామని ఎస్‌బీఐ చెర్మన్ శ్రీనివాసులు శెట్టి చెప్పారు. దీనికి తోడు ప్రస్తుతం వీరికి ఉన్న రూ.5 కోట్ల రుణ పరిమితిని మరింత పెంచే విషయాన్నీ పరిశీలిస్తున్నట్టు శెట్టి తెలిపారు.
Updated Date - Oct 14 , 2024 | 01:50 AM