ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాణిజ్య అవసరాలకు భవనాలను అద్దెకు ఇస్తుంటే?

ABN, Publish Date - Oct 27 , 2024 | 05:26 AM

హరి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తాను పొదుపు చేసిన డబ్బుతో ఒక మంచి ఏరియాలో కొంతం స్థలం కొనుగోలు చేశాడు. కొన్నేళ్లలో ఆ ప్రాంతం మంచి వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకుంది. దాంతో తాను కొన్న స్థలంలో ఒక భవనాన్ని...

హరి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తాను పొదుపు చేసిన డబ్బుతో ఒక మంచి ఏరియాలో కొంతం స్థలం కొనుగోలు చేశాడు. కొన్నేళ్లలో ఆ ప్రాంతం మంచి వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకుంది. దాంతో తాను కొన్న స్థలంలో ఒక భవనాన్ని నిర్మించి ఒక కార్పొరేట్‌ కంపెనీకి అద్దెకు ఇచ్చాడు. దీని అద్దె సంవత్సరానికి రూ.20 లక్షలు దాటుతుందని అనుకుందాం. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం వాణిజ్య భవనాలకు 18 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. అలాగే అద్దె రూ.20 లక్షలు దాటుతుంది కాబట్టి హరికి రిజిస్ట్రేషన్‌ పొందటానికి కానీ, పన్ను చెల్లించటానికి కానీ ఎలాంటి మినహాయింపు లేదు.

అయితే, హరికి జీఎ్‌సటీలో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ లేదు. జీఎ్‌సటీ గురించి ఎలాంటి అవగాహన లేదు. మరి దీని కోసం హరి జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలా? ఈ సమస్య ఒక్క హరికే కాదు చాలా మందికి ఉంటుంది. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది.


దీని ప్రకారం జీఎ్‌సటీలో రిజిస్ట్రేషన్‌ లేని వ్యక్తి తన వాణిజ్య భవనాన్ని లేదా వాణిజ్య సముదాయాన్ని లేదా అందులో భాగాన్ని ఏదేనీ కంపెనీకి లేదా వ్యాపార సంస్థకు అద్దెకి ఇచ్చి ఉంటే.. సదరు వ్యాపార సంస్థకు లేదా కంపెనీకి జీఎ్‌సటీలో రిజిస్ట్రేషన్‌ ఉంటే.. ఆ అద్దెపై జీఎ్‌సటీ చెల్లించాల్సిన బాధ్యత అద్దె చెల్లించే సంస్థదే. అంటే పై ఉదాహరణలో హరికి జీఎ్‌సటీలో ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేదు కాబట్టి సదరు కార్పొరేట్‌ కంపెనీకి రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లయుతే, సంబంధిత జీఎ్‌సటీ చెల్లించాల్సిన బాధ్యత ఆ కార్పొరేట్‌ కంపెనీదే. దీనినే రివర్స్‌ చార్జ్‌ మెకానిజం అంటారు. మరి, ఆ కంపెనీకి ఆ మేరకు నష్టం కదా అంటే, ఎంత మాత్రం నష్టం ఉండదు. ఎందుకంటే ఆ మొత్తాన్ని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు. అంటే, ఉదాహరణకు నెలకు రూ.2 లక్షలు అద్దె అనుకుంటే, ఇంతకుముందు కంపెనీ హరికి రూ.2 లక్షలు, దానిపైన జీఎ్‌సటీ రూ.36,000 కలిపి చెల్లించేది.


హరి రూ.2 లక్షలు తాను ఉంచుకుని ప్రభుత్వానికి రూ.36,000 చెల్లించేవాడు. కంపెనీ తాను చెల్లించిన రూ.36,000 మొత్తాన్ని ఐటీసీ రూపేణా తీసుకునేది. అయితే ఇందులో కొంత క్లిష్టత ఉండేది. హరి తొలుత రిజిస్ట్రేషన్‌ పొందాలి. నెలవారీ రిటర్నులు దాఖలు చేయాలి. తాను పొందిన అద్దెను సక్రమంగా చూపుతూ ప్రభుత్వానికి సంబంధిత జీఎ్‌సటీ సరిగా చెల్లించాలి. అంటే హరి విధి విధానాలను సరిగా పాటించకపోతే సదరు కంపెనీ ఐటీసీ పొందలేదు.

ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త విధానంలో హరి రిజిస్ట్రేషన్‌ పొందాల్సిన అవసరం లేదు. అలాగే కంపెనీ కూడా ఐటీసీ పొందటం సులువు. మరి ఇలా ఒక కంపెనీకి కాకుండా హరి తన భవనాన్ని ఒక 10 షాపుల కింద విభజించి 10 మందికి అద్దెకు ఇచ్చాడనుకుందాం. అప్పుడు అద్దెకు తీసుకున్న అందరికీ రిజిస్ట్రేషన్‌ ఉంటే, రివర్స్‌ చార్జ్‌ మెకానిజం కింద అద్దెకు తీసుకున్న వ్యక్తులు అందరూ వస్తారు. అందరు వారి వారి అద్దెలకు సంబంధించి జీఎస్‌టీ చెల్లిస్తారు.


మరి అందులో కొందరికి జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ లేకుంటే? అప్పుడు బిల్డింగ్‌ యజమానికి ఎంత అద్దె వస్తుందో చూడాలి. ఒకవేళ అద్దె మొత్తం రూ.20 లక్షలు దాటితే అప్పుడు భవన యజమాని రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్‌ తీసుకుంటాడో, అప్పుడు రివర్స్‌ చార్జ్‌ మెకానిజం వర్తించదు. అంటే, అన్ని షాపులకు భవన యజమాని జీఎ్‌సటీ చెల్లించాలి. అద్దెకు తీసుకున్న వ్యక్తులకు జీఎ్‌సటీ ఉన్నా లేకున్నా.. క్లుప్తంగా చెప్పాలంటే వాణిజ్య భవనాల అద్దెకు సంబంధించి రివర్స్‌ చార్జ్‌ అనేది యజమానికి రిజిస్ట్రేషన్‌ లేకుండా.. అద్దెకు తీసుకున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ ఉన్నప్పుడే అమలవుతుంది. అయితే, రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి కేవలం అద్దె మాత్రం కాకుండా ఇతర ఆదాయాన్ని కూడా చూడాలి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మన దేశంలో వాణిజ్య భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులకు కూడా ఈ విధానం చాలా ఉపయోగకరం.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Oct 27 , 2024 | 05:26 AM