ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రూ.60 కోట్లతో ఎన్‌కోర్‌-అల్కామ్‌ కొత్త ప్లాంట్‌

ABN, Publish Date - Jan 18 , 2024 | 05:13 AM

హైదరాబాద్‌కు చెందిన ఎన్‌కోర్‌- అల్కామ్‌.. కార్యకలాపాల విస్తరణలో భాగంగా రూ.60 కోట్లతో అల్యూమినియం డోర్స్‌, విండోల తయారీ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేస్తోంది...

హైదరాబాద్‌లో ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఎన్‌కోర్‌- అల్కామ్‌.. కార్యకలాపాల విస్తరణలో భాగంగా రూ.60 కోట్లతో అల్యూమినియం డోర్స్‌, విండోల తయారీ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని మోకిలా వద్ద ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. జర్మనీ టెక్నాలజీతో రోజుకు 30 వేల చదరపు అడుగుల అల్యూమినియం డోర్లు, విండోలను సూరత్‌ యూనిట్‌లో తయారు చేయనున్నట్లు సంస్థ సీఎండీ శివ కోటి రెడ్డి తెలిపారు. 1.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ యూనిట్‌ విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది. అల్కామ్‌ బ్రాండ్‌తో అల్యూమినియం డోర్లు, విండోలను కంపెనీ ఉత్తరాదిలో విక్రయిస్తోంది. కొత్త ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలోని రిటైల్‌ మార్కెట్లో కూడా అల్యూమినియం డోర్లు, విండోలను కంపెనీ ప్రవేశపెట్టనుంది.

Updated Date - Jan 18 , 2024 | 05:13 AM

Advertising
Advertising