ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బిగ్‌ సీ దసరా ధమాకా ఆఫర్లు

ABN, Publish Date - Oct 04 , 2024 | 02:09 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అగ్రశ్రేణి మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సీ దసరా సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. దసరా పండగను పురస్కరించుకుని వినియోగదారులకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను...

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అగ్రశ్రేణి మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సీ దసరా సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. దసరా పండగను పురస్కరించుకుని వినియోగదారులకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు బిగ్‌ సీ వ్యవస్థాపకుడు, సీఎండీ యం బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై రూ.10,000 వరకు మొబైల్‌ ప్రొటెక్షన్‌ ఉచితంగా అందించటంతో పాటు రూ.10,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రూ.5,999 విలువ గల ఒక కచ్చితమైన బహుమతి సహా ఎలాంటి వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండానే మొబైల్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బాలు చౌదరి చెప్పారు.


మరోవైపు ప్రతి ఒప్పో మొబైల్‌ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా రూ.10 లక్షల వరకు నగదు గెలుచుకోవటంతో పాటు ప్రతి వివో మొబైల్‌ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా బైక్స్‌, మొబైల్స్‌ గెలుచుకునే అవకాశాన్ని దసరా ధమాకా ఆఫర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు ఏటీఎం కార్డు ద్వారా ఎలాంటి వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండానే మొబైల్‌, స్మార్ట్‌ టీవీ, ల్యాప్‌టాప్‌, ఎయిర్‌ కండీషనర్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

Updated Date - Oct 04 , 2024 | 02:09 AM