ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

2030 నాటికి టాప్‌ 30లోకి ఆకాశా ఎయిర్‌

ABN, Publish Date - Mar 25 , 2024 | 04:07 AM

భారత్‌లో విమానయాన ధరలు ‘‘నమ్మలేనంత చౌక’’గా ఉన్నాయని, ఆకాశా ఎయిర్‌కు మంచి వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని ఆకాశా ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే అన్నారు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 30 విమానయాన సంస్థల్లో...

న్యూఢిల్లీ: భారత్‌లో విమానయాన ధరలు ‘‘నమ్మలేనంత చౌక’’గా ఉన్నాయని, ఆకాశా ఎయిర్‌కు మంచి వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని ఆకాశా ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే అన్నారు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 30 విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలవాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. వచ్చే గురువారం ముంబై నుంచి దోహాకు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ అవుతామని స్పష్టం చేశారు. విమానయాన రంగంలో పోటీ ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందని, ఫండమెంటల్స్‌పై దృష్టి కేంద్రీకరించినట్టయితే ఆకాశా ఎయిర్‌కే కాకుండా అన్ని విమానయాన సంస్థలకు అవకాశాలు ఉజ్వలంగానే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2022 ఆగస్టులో విమాన సర్వీసులు ప్రారంభించిన ఆకాశా ఎయిర్‌ ప్రస్తుతం 24 విమానాలతో 4.5 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.

Updated Date - Mar 25 , 2024 | 04:07 AM

Advertising
Advertising