ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదరగొట్టిన నవ లిమిటెడ్‌

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:09 AM

నవ లిమిటెడ్‌ కంపెనీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ2)లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.430.5 కోట్ల మొత్తం...

క్యూ2 లాభంలో 365% వృద్ధి

2:1 నిష్పత్తిలో షేర్ల విభజన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నవ లిమిటెడ్‌ కంపెనీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ2)లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.430.5 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.146.1 కోట్ల నికర లా భం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.31.40 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా 365.3 శాతం వృద్ధి చెందగా ఆదా యం 21.3 శాతం (రూ.355 కోట్లు) వృద్ధి చెందింది. త్రైమాసిక కాలంలో మెరుగైన పనితీరును కనబరచటం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. కాగా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.942.90 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.331.90 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


మరోవైపు గురువారం జరిగిన సమావేశంలో రూ.2 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.1 ముఖ విలువతో కూడిన రెండు షేర్లుగా (2ః1 నిష్పత్తి) విభజించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

Updated Date - Nov 15 , 2024 | 03:58 AM