Stock markets: 25 రోజులు, రూ.24,734 కోట్లు
ABN, Publish Date - Jan 29 , 2024 | 05:48 AM
స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు మళ్లీ అమ్మకా ల జోరు పెంచారు. డిసెంబరు నెలలో వారు భారత మార్కెట్‌లో రూ.66,134 కోట్ల నికర పెట్టుబడులు పెట్ట గా ఈ నెల 25 నాటికి రూ.24,734 కోట్ల విలువైన షేర్ల ను తెగనమ్మేశారు...
జనవరిలో ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు మళ్లీ అమ్మకా ల జోరు పెంచారు. డిసెంబరు నెలలో వారు భారత మార్కెట్‌లో రూ.66,134 కోట్ల నికర పెట్టుబడులు పెట్ట గా ఈ నెల 25 నాటికి రూ.24,734 కోట్ల విలువైన షేర్ల ను తెగనమ్మేశారు. వీరితో పాటు రిటైల్, హైనెట్‌వర్త్ మదుపరులూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను అమ్మేస్తూ, మార్కెట్‌ను మరింత అనిశ్చితిలోకి నెట్టేస్తున్నారు. దీంతో గత రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఎఫ్‌పీఐలు ఈ వారంలోనూ అమ్మకాల హోరు కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ఎందుకంటే...: పదేళ్ల కాల పరిమితి ఉండే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీరేట్లు తగ్గినట్టే తగ్గి, మళ్లీ 4.18 శాతానికి చేరాయి. దీంతో ఈ ఏడాది జూలై తర్వాత గానీ అమెరికా కేంద్రబ్యాంకు వడ్డీరేట్లు తగ్గించదని స్పష్టమవుతోంది. భారత్ వంటి వర్థమాన దేశా ల ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే, ఎఫ్‌పీఐలకు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలు సురక్షితంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఇక్కడ ఈక్విటీ షేర్లను అమ్మి, ఆ మొత్తాన్ని అమెరికా ప్రభు త్వ రుణ పత్రాల్లో మదుపు చేస్తున్నారు. ఒకవేళ మన దేశంలో మదుపు చేయాల్సి వచ్చినా, కేంద్ర ప్రభుత్వ రుణ పత్రాల్లో మాత్రమే మదుపు చేస్తున్నారు. జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడంతో లాభాలస్వీకరణ అమ్మకాలూ ఇందుకు తోడయ్యాయి.
Updated Date - Jan 29 , 2024 | 11:10 AM