సైబర్ మోసాలపై అప్రమత్తం
ABN, Publish Date - Oct 31 , 2024 | 01:13 AM
సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జెట్టి అన్నారు. బుధవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ మోసగాళ్లబారిన పడకుండా వుండడానికి, సైబర్ మోసాల గురించి ప్రజలకు వివరించడానికి పోలీసులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
గ్రామీణులకు అవగాహన కల్పిస్తాం
అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే.. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి
రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి
మాకవరపాలెం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జెట్టి అన్నారు. బుధవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ మోసగాళ్లబారిన పడకుండా వుండడానికి, సైబర్ మోసాల గురించి ప్రజలకు వివరించడానికి పోలీసులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ మోసాల బారినపడుతున్నారని ఆయన అన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తే.. సైబర్ నేరగాళ్లచేతిలో మోసపోక ముందే వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 1902 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీఐజీ వెంట డీఎస్పీ కుమార్, సీఐలు రేవతమ్మ, గోవిందరావు, ఎస్‌ఐ.దామోదర్‌నాయుడు వున్నారు.
గంజాయి నేరస్థులపై నిఘా
రోలుగుంట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాను అరికట్టడంతోపాటు గతంలో గంజాయి రవాణా చేస్తూ తప్పించుకుపారిపోయిన నిందితులను సత్వరమే అరెస్టు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పోలీసులను ఆదేశించారు. ఆయన బుధవారం రోలుగుంట పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. అన్ని రకాల రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి కేసుల్లో కింగ్‌పిన్‌లను కచ్చితంగా అరెస్టు చేయాలని స్పష్టం చేశారు. గంజాయి రవాణా, వ్యాపారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు వున్న వ్యక్తులు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను తయారు చేయాలని, చట్టప్రకారం జప్తు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో అరెస్టయి, తరువాత బెయిలుపై బయటకు వచ్చిన వారి కదలికపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆయన సూచించారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్, అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ బి.అప్పారావు, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ పి.రామకృష్ణారావు వున్నారు.
Updated Date - Oct 31 , 2024 | 01:13 AM