ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతే మన దేశ భవిష్యత్‌

ABN, Publish Date - Dec 01 , 2024 | 01:55 AM

యువతే మన దేశ భవిష్యత్‌ అని, విద్య వలన వినయం వస్తుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ 14వ

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

తాడేపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): యువతే మన దేశ భవిష్యత్‌ అని, విద్య వలన వినయం వస్తుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ యువతకు శారీరక దృఢత్వం అవసరమని యోగా, ప్రాణాయామం, వ్యాయామం చేస్తూ ఎప్పుడూ దృఽఢంగా ఉండాలన్నారు. వినయం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళుతుందన్నారు. 21వ శతాబ్దంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, డిగ్రీతోపాటు నైపుణ్యాలు నేటి యువతకు అవసరమని పేర్కొన్నారు. ప్రపంచం నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతోందని, అందులో భారత యువత కూడా ఏమాత్రం తీసిపోదన్నారు. నిత్యం నేర్చుకునే తత్వమే అత్యంత శక్తిమంతమైన ఆయుధమన్నారు. చదువుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతో మంది ఉంటారని, తానూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాడినేని తెలిపారు. ఉన్నత పాఠశాల విద్య కోసం రోజూ 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడినని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 2024 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 4,706 మందికి డిగ్రీలు, 42 బంగారు, 37 రజిత పతకాలు, 166 పీహెచ్‌డీ, 604 పీజీ, 3,936 యుజీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

Updated Date - Dec 01 , 2024 | 01:55 AM