ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమరావతి రైతుల పాపమేంటి?

ABN, Publish Date - Mar 29 , 2024 | 05:55 AM

అమరావతి రైతులు చేసిన పాపమేంటని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని

రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు.. అంతే తప్ప వారేమీ నేరం చేయలేదు

కేసులతో మహిళా రైతులకు ఇబ్బందులు

దక్షిణ భారతంలోనే పెద్ద రైతు ఉద్యమం.. అమరావతి రైతుల పోరాటం

కృష్ణామిల్క్‌ యూనియన్‌ సర్వసభ్య సమావేశంలో జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేసిన పాపమేంటని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని ఆనాటి ప్రభుత్వం అడిగితే ఇచ్చారే తప్ప... వారేమీ నేరం చేయలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్కడి మహిళలపై కేసులు పెట్టి ప్రభుత్వం అనేక రకాల బాధలు పెట్టిన విషయం చూశామన్నారు. కృష్ణా జిల్లా వీరవల్లిలోని విజయా డెయిరీ ఆటోమేషన్‌ ప్లాంట్‌లో గురువారం కృష్ణా మిల్క్‌ యూనియన్‌ 32వ సర్వసభ్య సమావే శంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అమరావతి రైతుల ఉద్యమం ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో జరిగిన పెద్ద పోరాటంగా అభివర్ణించారు. ఎయిర్‌పోర్టులో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తనను కలిసి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఐదేళ్లుగా పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాలను వివరించారని తెలిపారు. చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకపోవడంవల్ల అనేక రైతు వ్యతిరేక చట్టాలు పాస్‌ అవుతున్నా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ఇది వ్యవసాయ రంగానికి ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. పాడిపై వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించుకుని విదేశాలకు పంపించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇవన్నీ ఆనాటి రైతు నాయకుల దూరదృష్టి వల్లే సాధ్యమైందని తెలిపారు. పాడి పరిశ్రమను రక్షించాలని గుర్తించిన ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణ భారతంలో రైతు సంఘాల ఐక్యత చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థలోనూ అదే పరిస్థితి

న్యాయ వ్యవస్థలో రైతు కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రైతుల గురించి చాలా దుర్మార్గంగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ‘ఒకసారి కోర్టులో నా పక్కన ఉన్న న్యాయమూర్తి ఒక రైతుకు సంబంధించి నష్టపరిహారపు కేసు వచ్చినపుడు... ఆ రైతు తాలూకా, జిల్లా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎందుకు వచ్చాడు? భూమిని ఆయనేమైనా సంపాదించాడా? తాతలు ఇచ్చిన భూమికి రూ.10 వేలు నష్టపరిహారం ఇచ్చారు కదా.. దీనికోసం కోర్టుకు వచ్చి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏమిటి? అన్నపుడు తాను కలగజేసుకుని రైతుకు, భూమికీ ఉన్న సంబంధం తల్లికీ, బిడ్డకూ ఉన్న సంబంధమని, భూమి లేకపోతే ఆ రైతు నష్టపోతాడని నచ్చజెప్పటానికి ఒకరోజు సమయం పట్టింది’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వివరించారు.

Updated Date - Mar 29 , 2024 | 05:55 AM

Advertising
Advertising