ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏమిటీ ద్వంద్వ వైఖరి ?

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:03 AM

సోషల్‌ మీడియా కార్యకర్తలు వేధించకూడదని ఒక పక్క చెబుతారు... అదే సమయంలో మీ పార్టీ అధికారంలోకి వస్తే వేధింపులు తప్పవని టీడీపీ నాయకులను హెచ్చరిస్తారు... వేధింపులకు, కేసులకు భయపడం అంటారు.. మళ్లీ ఆపాలి అంటారు.. ఈ ద్వంద్వ వైఖరి కనీసం మీకు అయినా అర్ధం అవుతున్నాయా.. అని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కందికుంట

కదిరి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సోషల్‌ మీడియా కార్యకర్తలు వేధించకూడదని ఒక పక్క చెబుతారు... అదే సమయంలో మీ పార్టీ అధికారంలోకి వస్తే వేధింపులు తప్పవని టీడీపీ నాయకులను హెచ్చరిస్తారు... వేధింపులకు, కేసులకు భయపడం అంటారు.. మళ్లీ ఆపాలి అంటారు.. ఈ ద్వంద్వ వైఖరి కనీసం మీకు అయినా అర్ధం అవుతున్నాయా.. అని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రశ్నించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌ బీ బంగ్లాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు వైసీపీని ఇంత ఘోరంగా తిరస్కరించిన తర్వాత అయినా.. కనీసం బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాలని ఆయన కోరారు. కదిరిలో వైసీపీలో ఒకరు వడ్డీ వ్యాపారి, మరొకరు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తి, మరొకరు ఓడిపోయి ఆరు నెలలు అయిన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని వ్యక్తి .. ఇలాంటి వారిని పెట్టుకొని... తమ ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యే పని తీరు గురించి మాట్లాడడం హాస్వాస్పదంగా ఉందన్నారు. ఇసుక, మట్టి గురించి వైసీపీ వారు మాట్లాడటం.. విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చర్చి ఆస్తుల కేసులో ఫిర్యాదు చేసింది వైసీపీ కార్యకర్తేనని, అది కూడా ఆ అధినాయకుడి నియోజకవర్గానికి చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. దొంగ పనులు చేస్తూ వైసీపీ నాయకులు పట్టుబడితే అధికారులు జరిమానా విధించారని చెప్పారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని గ్రీన ట్రిబ్యూనల్‌కు ఎందుకు ఆ నాయకులు పోలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు చేసిన భూకబ్జాలు, అక్రమాలు వెలికి తీస్తున్నామని, అక్రమాలు ఏపార్టీ వారు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పారు. ఇప్పటికే నలుగురు టీడీపీ నాయకుల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. ఇసుకపై వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బహిరంగా చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఎనపీకుంట ఇసుక వరకు అన్ని మాట్లాడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలు మారారని, మరో నియోజకవర్గం మారకుండా చూసుకోవాలని ఉషచరణ్‌శ్రీకి సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్‌ రంగారెడ్డి, టీడీపీ నాయకులు కొమ్మినేని గంగయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:03 AM