రేపు మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:40 PM
కేంద్ర మాజీ మంత్రి, దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి పురస్కరించుకుని 20వ తేదీన మొగల్తూరులో షుగర్, గ్యాంగ్రీన్ వ్యాధులకు సంబంధించి మెగా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి
మొగల్తూరు, జనవరి 18 : కేంద్ర మాజీ మంత్రి, దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి పురస్కరించుకుని 20వ తేదీన మొగల్తూరులో షుగర్, గ్యాంగ్రీన్ వ్యాధులకు సంబంధించి మెగా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సొంతూరు మొగల్తూరు అంటే కృష్ణంరాజుకు ఎంతో మమకారంతో ఉండేవారన్నారు. ఆయన జయంతి పురస్కరించుకుని పేదలకు అందని ఎంతో వ్యయంతో కూడిన షుగర్ వ్యాధి కారణంగా వచ్చే గ్యాంగ్రీన్ అనే వ్యాధి సోకినవారికి ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్రీన్ వైద్య నిపుణుడు కవర్తపు వేణు కృష్ణంరాజుపై ఉన్న అభిమానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా వస్తున్నారన్నారు. లండన్, అబుదాబి, హైదరాబాద్, విజయవాడ, భీమవరానికి చెందిన 30మంది ప్రముఖ వైద్యులు సేవలందిస్తారన్నారు. తమ కుటుంబ వారసుడు హీరో ప్రభాస్, తమ కుమార్తెలు కృష్ణంరాజు పేరిట విద్య, వైద్య సేవలందించేందుకు సహకరిస్తున్నారన్నారు. ఈ శిబిరంలో వైద్య సేవలు పొందేవారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలనాన్నారు. సమావేశంలో దాసరి బాబి, గ్రామీణ వైద్య సంఘ నాయకులు కేఎస్‌పీఎన్ ముక్తేశ్వరరావు, సీహెచ్‌వీపీ శ్రీనివాస ప్రసాద్, పులపర్తి రమేష్, సత్యనారాయణ తదితరులున్నారు.
కృష్ణంరాజు లేకుండా సొంతూరు రావడం బాధిస్తోంది..
తన భర్త కృష్ణంరాజు లేకుండా సొంతూరు మొగల్తూరుకు రావడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆమె ఆవేదనన వ్యక్తం చేశారు. గురువారం ఆమెను కలిసిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో మాట్లాడారు. గ్యాంగ్రీన్ అపరేషన్‌కు సుమారు రూ.50 లక్షలు వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రతీ ఏటా ఉచితంగా ఈ రకమైన వైద్య సేవలందించేందుకు తమ కుటుంబం నిర్ణయం తీసుకుందని మాధవ నాయుడుకు ఆమె తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 11:40 PM