నాడు కోటిపల్లి.. నేడు మచిలీపట్నం
ABN, Publish Date - Sep 24 , 2024 | 01:10 AM
కోటిపల్లి–నరసాపురం–మచిలీపట్నం రైల్వేలైన్ ప్రతిపాదన బ్రిటీష్ ప్రభుత్వ కాలం నాటిది. కాని, నరసాపు రం – విజయవాడ మధ్య లైన్ ఏర్పడిందే తప్ప కోటిపల్లి–నరసాపురం– మచిలీపట్నం మార్గాలకు మోక్షం లభించలేదు.
నరసాపురం, సెప్టెంబరు 23 : కోటిపల్లి–నరసాపురం–మచిలీపట్నం రైల్వేలైన్ ప్రతిపాదన బ్రిటీష్ ప్రభుత్వ కాలం నాటిది. కాని, నరసాపు రం – విజయవాడ మధ్య లైన్ ఏర్పడిందే తప్ప కోటిపల్లి–నరసాపురం– మచిలీపట్నం మార్గాలకు మోక్షం లభించలేదు. 2001లో కోటిపల్లి రైల్వే లైన్‌కు పచ్చజెండా ఊపినప్పటికీ నిధులు విడుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది. తొలిసారి 2015లో ఈ ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు కేటాయించింది. తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మచిలీపట్నం రైల్వేలైన్‌ను ఈ బడ్జెట్‌లో తెరమీదకు తీసుకొచ్చింది. రెండు నెలల వ్యవధిలో సర్వే పూర్తి చేయించి కొత్త లైన్‌కు సానుకూలత తీసుకొచ్చింది. ఈ పనులు ప్రారంభానికి నోచుకుంటే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా మధ్య 120 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ ఏర్పడనుంది.
కోటిపల్లి రైల్వేలైన్
బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ గోదావరిపై భారీ వంతెనలు నిర్మించాల్సి రావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2001లో దీనికి పచ్చ జెండా ఊపారు. నిధులు మాత్రం 2015 వరకు కేటాయించలేదు. 2014 ఎన్నికల్లో భీమవరం బహిరంగ సభలో ప్రధాని మోదీ కూటమిని గెలిపిస్తే.. కోటిపల్లిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 2015 బడ్జెట్‌లో ఈ లైన్‌కు రూ.300 కోట్లు విడు దల చేయించి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.1,200 కోట్లను రైల్వే ఖర్చు చేసింది. 51 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ కొత్తలైన్ వల్ల కోనసీమకు రైల్వేకూత వినిపించనుంది. విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్‌లైన్‌లో ట్రాఫిక్ తగ్గనుంది. ప్రస్తుతం ఈ లైన్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నందున్న కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు వీలు పడటం లేదు. కోటి పల్లి లైన్ పూర్తయితే సామర్లకోట–కోటిపల్లి–నరసాపురం మీదుగా విజ యవాడకు కొత్త మార్గం ఏర్పడనుంది. వీటిని అధ్యయనం చేసి రైల్వే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రస్తుతం 60 శాతం పనులు పూర్త య్యాయి. రెండేళ్లలో ఈ కొత్తలైన్ పనులను పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లైన్‌లో రైళ్లు పట్టాలు ఎక్కితే జిల్లాలో నర సాపురం పెద్ద జంక్షన్‌గా మారనుంది. విశాఖ నుంచి ఒడిశా, కోల్‌కతా, అస్సోం ఇతర ఈశాన్య రాష్ర్టాల నుంచి వచ్చే చాలా రైళ్లను కోటిపల్లి మీదుగా విజయవాడకు మళ్లించనున్నారు.
శివారు స్టేషన్ మచిలీపట్నం
విజయవాడ డివిజన్‌లో శివారునున్న స్టేషన్లలో మచిలీపట్నం ఒకటి, దూరప్రాంతాలకు చాలా రైళ్లను ఈ స్టేషన్ నుంచి నడుపుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఈ రైల్వేస్టేషన్‌ను జంక్షన్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దశాబ్దాలుగా పెండింగ్‌లోవున్న నరసాపురం, మచిలీపట్నం రైల్వేలైన్‌ను తెర మీదకు తీసుకొచ్చింది. ఈ ఏడాది బడ్జెట్ లో తొలిసారిగా కొత్త లైను ప్రస్థావన వచ్చింది. దీంతో బ్రిటీష్ హయాం లో ప్రతిపాదనలో ఉన్న ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందా, అన్న సందేహం జిల్లావాసుల్లో నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే రైల్వే సర్వే పూర్తి చేయడం సాఽధ్యాసాధ్యాలపై సానుకూలంగా రిపోర్టును రూపొందించడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. సుమారు 70 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ కొత్తలైన్ వల్ల తీర ప్రాంతానికి రైలు మార్గం ఏర్పడనుంది. కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉంటు న్న బంటుమిల్లి, కృత్తివెన్ను వంటి మండలాల్లో రైలు కూత వినిపిం చనుంది. తూర్పు, కోనసీమ, పశ్చిమ, కృష్ణా జిల్లాల మధ్య దూరం తగ్గి కొత్త రైల్వేలైన్ ఏర్పడనుంది.
జంక్షన్‌గా నరసాపురం
కోటిపల్లి రైల్వే మార్గంతోనే నరసాపురం పెద్ద జంక్షన్ కానుందని, అంతా భావించారు. తాజాగా మచిలీపట్నంను కలపడంతో అతి పెద్ద జంక్షన్‌గా మారబోతుంది. ఇప్పటికే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫారాల సంఖ్య మూడుకు పెరిగింది. రానున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో అమృత్ భారత్ నిధులు రూ.25 కోట్లతో అధునిక హంగులతో రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్‌లో ఒక ఎక్స్‌లేటర్, ఒక లిప్ట్, మరో ప్లై ఓవర్ వంతెన రానున్నాయి.
ఎన్నికల హామీని అమలు చేస్తాం : నాయకర్, ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. దాన్ని వమ్ము చేయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తాం. దీనికి అనుగుణంగానే తీర ప్రాంతంలో రహ దారులు, రైల్వే ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయిస్తున్నాం. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఈ ప్రాంత ఆభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చారు. పెండింగ్ ప్రాజెక్ట్ పనులను త్వరలో ప్రారంభిస్తాం.
Updated Date - Sep 24 , 2024 | 01:10 AM