వృద్ధుడి సజీవ దహనం
ABN, Publish Date - Jan 09 , 2024 | 12:28 AM
అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.
దగ్ధమైన పూరిల్లు
కలిదిండి, జనవరి 8 : అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. కలిదిండి మండలం మూల్లంక పంచాయతీ పరిధిలోని చినపుట్లపూడికి చెందిన శీలం నాగేశ్వరరావు (75) కుమారులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆయన తన పూరింట్లో నిద్రిస్తుండగా, షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడి సజీవ దహనమయ్యాడు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూల్లంక సర్పంచ్ మహదేవ విజయ్, వీఆర్వో డేవిడ్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - Jan 09 , 2024 | 12:28 AM