ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా మట్టల ఆదివారం

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:23 AM

జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ ఘనంగా నిర్వహించారు. పట్టణ, గ్రామాల్లోని వీధుల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఏలూరులో ఎల్‌ఈఎఫ్‌ చర్చి..సండే స్కూల్‌ విద్యార్థుల ర్యాలీ

ఈత మట్టలతో క్రైస్తవుల ర్యాలీలు

చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ ఘనంగా నిర్వహించారు. పట్టణ, గ్రామాల్లోని వీధుల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఏలూరు కల్చరల్‌/ఏలూరు టూటౌన్‌, మార్చి 24 : క్రైస్తవుల జయోత్సాహ నినాదాలతో గ్రామాల్లో వీధులు మార్మోగాయి. హోసన్నా జయం.. రాజుల రాజుకే జయం.. క్రీస్తు రాజుకే జయం అంటూ ఈతమట్టలతో ర్యాలీలు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు, పెద్దలు వీధుల్లో ఈతమట్టలు, ఫ్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. ఏలూరు రూరల్‌ మండలంలోని పాలగూడెం, చాటపర్రు, జాలిపూడి, గుడివాకలంక గ్రామాల్లో ఏసుక్రీస్తు లోకరక్షకుడు అని నవజీవన సహవాస సమాజ మంది రం ఫాస్టర్‌ ఎం.ఐ ప్రసాద్‌ అన్నా రు. మండలవ్యాప్తంగా మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు నగరంలోని సండే స్కూల్‌ విద్యార్థులు, యవ్వనస్తులు నగర వీధుల్లో ఈతమట్టలకు పువ్వులు ధరించి తిరిగారు. విద్యార్థులు చక్కని నాటికలతో, యవ్వనస్తులు ప్రత్యేక గీతాలతో అలరించారు. పాస్టర్లు, బ్రదర్లు మట్టలాధివారం యొక్క విశిష్టతను తెలియజేశారు. నగరంలో ఆర్‌సీఎం, సీఎస్‌ఐ, ఎల్‌ఈఎఫ్‌, బాప్టిస్టు, పెంతికోస్తు, సాల్వేషన్‌ ఆర్మీ, మన్నా చర్చ్‌, ఐసీఎం, చర్ఛ్‌ఆఫ్‌ క్రైస్ట్‌ తదితర చర్చ్‌లలో మట్టలాధివారం ఆరాధనలు జరిగాయి. ఎల్‌ఈఎఫ్‌ చర్చిలో బ్రదర్‌ సురేష్‌మార్కస్‌, ఆర్‌సీఎం కథోలిక పీఠాధిపతులు మోస్ట్‌ రెవరెండ్‌ బిషప్‌ జయరావు పొలిమేర అమలోద్బవి కెతడ్రల్‌ దివ్యబలిపూజ నిర్వహించి మట్ట లాదివారం ప్రత్యేక సందేశాన్ని వినిపించారు. ఐసీఎం చర్చిలో బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ జాన్‌ఎస్‌డీ రాజు దైవసందేశం అందించారు. మన్నా చర్చిలో బిషప్‌ ఎలీషారాజు పాస్టర్‌ జ్యోతిరాజు మట్టలాదివారం విశిష్టత వివరించారు.

పోలవరం/టి.నరసాపురం/బుట్టాయగూడెం, మార్చి 24 : పోలవరం మండలంలో గూటాల, కొత్తపట్టిసీమ, పట్టిసీమ, కృష్ణారావుపేట, ప్రగడపల్లి, పోలవరం, ఎల్లండీపేట గ్రామాల్లో చర్చిలలో ఫాదర్లు, సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తపేట కర్మేలు ప్రార్థనా మందిరం ఫాదర్‌ రెవరెండ్‌ పీజే సుధాకర్‌, సీయోను చర్చి ఫాదర్‌ రెవరెండ్‌ నిమ్మకూరి డేవిడ్‌ రాజు మాట్లాడుతూ యేసు నందు నిద్రించిన వారు ధన్యులని వారి ఆత్మలు యేసు ఆత్మ చేత పరిశుద్దమవు తాయన్నారు. టి.నరసాపురం మండలం, టి.నరసాపురం పంచాయతీ ప్రకాశ్‌నగర్‌లో గల షాలేము ప్రార్థన మందిరలో మట్టల ఆదివారం ఘనం నిర్వహించారు. ఫైర్‌ ప్రేయర్‌ టీం సభ్యులు జి.జ్ఞాన్‌రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం సెయింట్‌ మార్క్సు లూథరన్‌ దేవాలయం సంఘకా పరి పాస్టర్‌ రెవరెండ్‌ ఎంఏ ఆమెన్‌ ఆధ్వర్యంలో మట్టలాదివారం నిర్వహించారు.

చింతలపూడి/కామవరపుకోట, మార్చి 24 : చింతలపూడి మండలం బోయగూడెం చర్చి పరిధిలో క్రైస్తవులు చార్లెస్‌ నగర్‌నుంచి మట్టలతో ప్రదర్శన జరుపుతూ బోయగూడెం చర్చివరకు ప్రదర్శన జరిపారు. ఫాదర్‌ కామా మార్జు మట్టల ఆదివారం విశేషాలను భక్తులకు వివరించారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో ఫాదర్స్‌ దోమతోటి నతానియేలు, నెల్లిజార్జి, మాజీ సర్పంచ్‌ మేరుగు సుందరరావు, సంఘ పెద్దలు, దళం సభ్యులు, క్రైస్తవ సహోదరులు మట్టలతో గ్రామంలో ఊరేగింపును క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ జరిపారు.

పెదవేగి/పెదపాడు/దెందులూరు, మార్చి 24 : పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో క్రైస్తవ విశ్వాసులు చర్చిలలో ప్రార్థనలు జరిపి, ఈతమట్టలు చేతపట్టి వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తురాజుకు జై, యూదుల రాజు దావీదుకు జై అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. పెదపాడు మండలం పునుకొల్లు గ్రామ సీఎస్‌ఐ చర్చిలో మహిళలు, చిన్నారులు ఈత కొమ్మలకు పూలు గుచ్చి దేవుని సుత్తిస్తూ గ్రామంలో పాదయాత్ర చేశారు. దెందులూరు మండలం పోతునూరు, దోసపాడు పరిధిలో ఫాదర్‌ పరిశే డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టలతో ర్యాలీ నిర్వహించారు. దెందులూరు ఆర్‌సీఎం పాదర్‌ అమాన్‌ రాజా ఆధర్వర్యంలోను క్రైస్తవలు మట్టలతో ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - Mar 25 , 2024 | 12:23 AM

Advertising
Advertising