ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్రా మద్యంపై తెలంగాణ చూపు

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:24 AM

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం షాపులు దక్కించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం మద్యం వ్యాపారులు జిల్లాకు తరలివచ్చారు.

కోలాహలంగా టెండర్లు.. సిండికేట్‌ అయ్యేందుకు ఎత్తుగడలు

నరసాపురం/పాలకొల్లు, అక్టోబరు 3 : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం షాపులు దక్కించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం మద్యం వ్యాపారులు జిల్లాకు తరలివచ్చారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలో మాదిరిగా ఇక్కడ వ్యాపారం ఉండదేమోననే సందేహంతో.. ఎంతో ఆశతో వచ్చిన వ్యాపారుల్లో కొందరు తిరుగుముఖం పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు తదితర పట్టణాలలోని పలు రెసిడెన్సీల్లో తెలంగాణాకు చెందిన పలువురు మద్యం వ్యాపారులు వచ్చి మకాం వేశారు. అయితే ఇక్కడ పరిస్థితులు గమనిస్తున్న తెలంగాణ మద్యం వర్తకులు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాపారం ఉండదనే సంశయంతోపాటు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠినచర్యలు ఉంటాయని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంతో తెలంగాణ వ్యాపారులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సిండికేట్లగా ఏర్పడి ఒక్కొక్క షాపుకు 20 నుంచి 25 దరఖాస్తులు వేయడానికి నిర్ణయించు కున్నట్లు తెలుస్తోంది. 2019కి ముందు ఇక్కడ మద్యం వ్యాపారంలో హవా కొనసాగించిన టీడీపీ, వైసీపీలకు చెందిన నాయకులు ఇప్పుడు మరలా సిండికేట్లుగా ఏర్పడుతున్నారు. సగటున ఒక్కొక్కషాపుకు 20 నుంచి 30 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయానికి సైతం రిజిస్ర్టేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదా యం ప్రఽథమ స్థానంలో ఉండగా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ద్వితీయస్థానంలో ఉంది. మొత్తంగా అధికార కూటమికి చెందిన నాయకులతోపాటూ, వైసీపీ నాయకులు మద్యం సిండికేట్లను దక్కించుకుని పెద్దఎత్తున మద్యం వ్యాపారంలోకి ప్రవేశించడానికి పావులు వదుపుతున్నారు.

చిలక్కొట్టుడు

ప్రస్తుతం ప్రభుత్వ మద్యం షాపుల గడువు మరో పది రోజుల్లో ముగుస్తుందనగా మద్యం షాపుల సిబ్బంది చిలక్కొట్టుడుకు తెర తీశారు. అనేక దుకాణాల్లో క్వార్టర్‌ మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై మద్యం బాబులు గగ్గోలు పెడుతున్నారు.

దుకాణం దక్కితే చాలు..

ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీని అమల్లోకి తీసుకురావడంతో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు యువత నుంచి పాత వ్యాపారస్థులు, వివిధ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. ఎలాగైనా సరైన దుకాణాన్ని దక్కించుకుని వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దరఖాస్తు డిపాజిట్‌ రూ.2లక్షలు అయినప్పటికీ లెక్క చేయడం లేదు. డబ్బులు రిటన్‌ రాకపోయినా దుకాణం వస్తే చాలన్న ధీమాతో ఫారాలు కొనేందుకు ఎగబడుతున్నారు. దీంతో గురువారం జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, టీపీగూడెం, తణుకు, ఆకివీడు, పెనుగొండ సర్కిల్‌ కార్యాలయల వద్ద కోలాహలం కనిపించింది. వివరాలు తెలుసుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. గతంలో వ్యాపారం చేసిన వారే ఎక్కువ సంఖ్యలో కార్యాలయాల వద్ద దర్శనమిచ్చారు. జిల్లాలో మొత్తం 175 దుకాణాలకు లాటరీ తీయనున్నారు.

మారిన విధానాలు..

ఈ సారి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా టెండర్లు వేయవచ్చు. అతనికి ఎన్ని షాపులు లాటరీలో తగిలితే అన్ని కేటాయిస్తారు. గతంలో ఈ విధానం ఉండేదికాదు. లాటరీలో ఒక దుకాణం తగిలితే మిగిలిన షాపులకు అతను పేరు తొలగించేవారు. ఈ విధానం వల్ల అప్పట్లో వ్యాపారులు బినామీ పేర్లతో ఫారాలు కొనేవారు. ఈసారి కొత్త పాలసీ రావడంతో చాలా మంది తమ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లపైనే టెండర్లు వేసేందుకు మక్కువ చూపుతున్నారు.

గతంలో ముందుగానే షాపులు వివరాలు తెలిసేవి, దీని వల్ల బాగా వ్యాపారం జరిగే షాపుకు పోటీ ఎక్కువుగా ఉండేది. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం పట్టణ, మండల పరిధిల్లో దుకాణాల సంఖ్య మాత్రమే చెబుతున్నారు. పట్టణంలో దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీలో దుకాణం తగిలితే ఆ పట్టణ పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే విధానం మండలానికి తీసుకొచ్చారు. ఈ నిబంధనతో పాటు పట్టణ పరిధిని 2కిలోమీటర్ల వరకు పెంచారు. రెండు కిలోమీటర్ల పట్టణానికి వెలుపుల పంచాయతీ పరిధులు ఉన్నా అది పట్టణ పరిధికే వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా పట్టణంలో షాపు దక్కించుకున్న పాటదారులు దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు. టెండర్‌ వేసే వ్యక్తి ఖచ్చితంగా 21ఏళ్లు దాటి ఉంటాలి. 9న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - Oct 04 , 2024 | 12:24 AM