ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జల్‌ జీవన్‌ మిషన్‌కు.. కొత్తరూపు

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:34 PM

జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంఽధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు సమకూరుస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనులు అంతంత మాత్రంగానే జరిగాయనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

జల్‌ జీవన్‌ మిషన్‌కు మరో మూడేళ్లు గడువు పెంపు

గత ప్రభుత్వ హయాంలో 1772 పనులకు రూ. 454 కోట్ల కేటాయింపు.. కేవలం 837 పనులే పూర్తి

బిల్లులు రాక పనులు చేయడానికి కాంట్రాక్టర్ల వెనుకంజ

ప్రస్తుతం మిగిలిన పనులతో పాటు మరో 117 పనులకు రూ. 180 కోట్ల కేటాయింపు

ఏలూరు సిటీ, సెప్టెంబరు 28 : జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంఽధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు సమకూరుస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనులు అంతంత మాత్రంగానే జరిగాయనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. జల్‌ జీవన్‌ మిషన్‌కు కొత్త రూపు ఇస్తూ పాత పనులతో పాటు కొత్తగా మరిన్ని పనులు చేపట్టేందుకు సన్నద్ధమయింది.

గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో జల్‌ జీవన్‌ పనులు అసలు ప్రారంభించనే లేదు. ఆ తర్వాత 2020లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్లు ఈ పనులు చేయడానికి ముందుకు రాలేదు. ఈ కారణంగా 1772 పనులకు అప్పట్లో 837 పనులు మాత్రమే పూర్త య్యాయి. 413 పనులు ప్రారంభించారే కాని అవి తొలి దశలోనే ఆగి పోయాయి. మిగిలిన 522 పనులు అసలు ప్రారంభించనే లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాగానే ఈ జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నిర్వహణపై ఇంటింటికీ పల్స్‌ సర్వే నిర్వహించి అసలు ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేశారా.. లేదా అన్న విషయా లను పరిశీలించింది. పనులు ఎంత వరకు చేశారు. ఏఏ పనులు మిగిలి పోయాయి అన్న విషయాన్ని ఈ సర్వేలో తేల్చారు.

ముందుకు రాని కాంట్రాక్టర్లు

జిల్లాలో 85 శాతం ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు అయ్యాయి. జిల్లాలో 3,60,000 ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండ గా వాటిలో 3,18,000 ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు అయి ఉన్నా యి. మిగిలిన 42,922 ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని గ్రామీణ నీటి పారుదల శాఖ (ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ) నివేదికలు చెబుతున్నాయి. జల్‌ జీవన్‌ మిషన్‌లో అప్పల్లో కాంట్రా క్టర్లు పనులు చేయడానికి ముందుకు రాక పోవ డంతో ఈ పనులను చేయడానికి గ్రామాల్లో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల ద్వారా గ్రామ జల సంఘాలను ఏర్పాటు చేశారు. వారి ద్వారా ఈ పనులు చేయిందామని గత ప్రభుత్వం నిర్ణయించినా ఆ విధంగా కూడా పనులు నిర్వహించలేక పోయింది. దీనికి కారణం కనీసం పనులు నిర్వహించడానికి మెటీరియల్‌ కూడా ఇవ్వలేదు. జల్‌ జీవన్‌ మిషన్‌లో బోర్‌వెల్స్‌, ఎస్‌ఎస్‌ ట్యాంకులు, ఫిల్టర్‌ పాయింట్లు, రక్షిత మంచినీటి పథకాలు, పైప్‌లైన్లు ఏర్పాటు చేసి అప్పుడు ఇంటింటికీ కుళాయి ఇవ్వాలని ఈ పథకంలో నిర్ధేశించినా ఆ విధంగా జరగలేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్లు లక్ష్యం

జల్‌ జీవన్‌ మిషన్‌లో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి రోజువారీ 55 లీటర్లు స్వచ్ఛమైన నీటిని అందించాలనేదే ముఖ్య ఉద్దేశ్యం. అయితే గత నాలుగేళ్లలో ఈ పథకంలో స్వచ్ఛమైన మంచినీటిని అప్పటి ప్రభుత్వం అందించలేక పోయింది. మంచినీటి అవసరాలు ఉన్నచోట్ల పథకాలను ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి.

జల్‌ జీవన్‌ మిషన్‌పై కూటమి ప్రభుత్వం చొరవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను పరిశీలించింది. అందులో నాణ్యత ఎంత ఉందో, ఇంటింటికీ సక్రమంగా కుళాయిలు ఏర్పాటు చేసి నాణ్యమైన స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారా.. లేదా అన్న విషయాలను పల్స్‌ సర్వే ద్వారా తెలుసుకున్నారు. ఆ సర్వే ఆధారంగా జిల్లాలో ఇంకా మంచినీటి అవసరాలు ఉన్నట్టు గుర్తించింది. గతంలో ఆగిపోయిన 935 పనులతో పాటు అదనంగా మరో 117 పనులు చేపట్టాలని నిర్ణయించింది. గతంలో కేటాయించిన నిధులకు అదనంగా మరో రూ.180 కోట్లు అవసరమవుతాయని ఆ నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం నిర్వహణకు 2024తోనే గడువు ముగిసింది. అయితే రాష్ట్రప్రభుత్వ అభ్యర్థన మేరకు 2027 వరకు ఈ పఽథకాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం జిల్లాలో అవసరమైన చోట్ల అక్కడ మంచినీటి అవసరాలకు అనుగుణంగా బోర్‌వెల్స్‌, ఎస్‌ఎస్‌ ట్యాంకులు, ఫిల్టర్‌ పాయింట్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయ డానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.

రూ.25 కోట్ల బకాయిలు

జల్‌ జీవన్‌ మిషన్‌కు సంబంధించి జిల్లాలో కాంట్రాక్టర్లుకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.25 కోట్లు వరకు ఉన్నాయని చెబుతున్నారు. ఆ బకాయిలు చెల్లిస్తే వారు పనులు చేయడానికి ముందుకు వస్తారని తెలుస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.

Updated Date - Sep 28 , 2024 | 11:35 PM