వర్క్‌షాపులతో న్యాయ విజ్ఞానం పెంపు
ABN, Publish Date - Mar 31 , 2024 | 12:11 AM
న్యాయవిజ్ఞానాన్ని పెంపొందించుకోవ డానికి న్యాయ మూర్తులకు వర్క్‌షాపులు దోహదపడతాయని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు.
హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్
ఏలూరు కలెక్టరేట్/ఏలూరు క్రైం, మార్చి 30 : న్యాయవిజ్ఞానాన్ని పెంపొందించుకోవ డానికి న్యాయ మూర్తులకు వర్క్‌షాపులు దోహదపడతాయని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని న్యాయమూర్తు లకు వివిధ అంశాలపై నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ న్యాయమూర్తులకు చట్టంపై స్థూలమైన, విధానపరమైన విజ్ఞా నం ఎప్పటికప్పుడు అవసరమన్నారు. వర్క్‌షాపులో రీసోర్స్ పర్సన్లుగా సీనియర్ న్యాయ వాదులు వై.వి రవిప్రసాద్, ఎం.సూరిబాబు, రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.సాల్మన్ రాజు పాల్గొని పార్టీషన్, మార్టిగేజ్, మనీ,డిక్లరేషన్, ఇంజెక్షన్ చట్టాలు మారుతున్న సవ రణలపై అవగాహన కల్పించారు. అనంతరం కేసుల విచారణ, పురోగతి తదితర విషయాలను చర్చించారు. తొలుత జస్టిస్ బి.కృష్ణ మోహన్ ఏలూరు జిల్లా కోర్టు వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామ్‌గోపాల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఏలూరు బార్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్ పూల మొక్కను అందిం చారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా జస్టిస్ కృష్ణమోహన్ ను జడ్పీ గెస్ట్ హౌస్‌లో ఎస్పీ మేరీ ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురు షోత్తమ కుమార్,ఎస్పీ మేరీ ప్రశాంతి ఆయనతో సమావేశమయ్యారు.
కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన
కోర్టుకు వచ్చే కక్షిదారులకు, న్యాయవాదులకు, సిబ్బంది, న్యాయాధికారులకు మౌలిక సదుపాయాల్లో భాగంగా కోర్టు హాల్స్‌లో ఎయిర్ కండీషన్స్ ఏర్పాటు చేస్తామని జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని అన్ని కోర్టు హాళ్లల్లో ఏర్పాటు చేసిన ఏసీలను, రూ.22 లక్షలతో ఏర్పాటు చేసిన లిప్టును, సోలార్ సిస్టమ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘రాష్ట్ర వ్యాప్తంగా 643 కోర్టులలో ఎయిర్ కండీషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కోర్టులు ఉండగా 209 ఏసీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఎంతో చరిత్ర కలిగి ఉంది.’ అన్నారు. జిల్లా ప్రధాన న్యా యమూర్తి సీహెచ్ పురుషోత్తమకుమార్, మొదటి అద నపు జిల్లా జడ్జి రామ్‌గోపాల్, పరిపాలనాధికారి నాగ రాజు, న్యాయాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Mar 31 , 2024 | 12:12 AM